Gangavva: ‘ఫారిన్ వచ్చినాం’.. దుబాయ్ బుర్జ్‌ ఖలిఫా భవనం వద్ద గంగవ్వ.. వీడియో చూశారా?

మై విలేజ్‌ షో తో గంగవ్వ పేరు నెట్టింట మార్మోగిపోయింది. ఇందులో సినీ ప్రముఖులతో గంగవ్వ చేసే ఇంటర్వ్యూలు ఆమెను కూడా ఓ స్టార్ సెలబ్రిటీగా మార్చేశాయి. ఈ కారణంగానే ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అలాగే సుమారు 60 ఏళ్ల వయసులో బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలోనూ అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. తన ఆటతీరు, మాట తీరుతో నాగార్జునతో పాటు ప్రేక్షకుల మనసులు కూడా గెల్చుకున్నారు.

Gangavva: 'ఫారిన్ వచ్చినాం'.. దుబాయ్ బుర్జ్‌ ఖలిఫా భవనం వద్ద గంగవ్వ.. వీడియో చూశారా?
Gangavva
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2023 | 11:21 AM

గంగవ్వ.. అమాయకంగా, ఎలాంటి కల్మషం లేని మాటలతో మురిపించే ఈ సోషల్‌ సెలబ్రిటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉండే ఆమె తన యాస, భాష, వేషధారణతో సోషల్‌ మీడియా సెలబ్రిటీగా మారిపోయారు. ముఖ్యంగా మై విలేజ్‌ షో తో గంగవ్వ పేరు నెట్టింట మార్మోగిపోయింది. ఇందులో సినీ ప్రముఖులతో గంగవ్వ చేసే ఇంటర్వ్యూలు ఆమెను కూడా ఓ స్టార్ సెలబ్రిటీగా మార్చేశాయి. ఈ కారణంగానే ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అలాగే సుమారు 60 ఏళ్ల వయసులో బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలోనూ అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. తన ఆటతీరు, మాట తీరుతో నాగార్జునతో పాటు ప్రేక్షకుల మనసులు కూడా గెల్చుకున్నారు. అయితే సెలబ్రిటీగా మారినా తన సంస్కృతి, సంప్రదాయాలను మరవడం లేదు గంగవ్వ. తాజాగా తన మై విలేజ్‌ షో టీమ్‌ సభ్యులతో కలిసి దుబాయ్‌ పర్యటనకు వెళ్లారు గంగవ్వ. బతుకమ్మ వేడుకల సందర్భంగా దుబాయిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో గంగవ్వ పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఇక దుబాయ్‌ నగరం అందాలను ఎంజాయ్‌ చేస్తూ అక్కడి అందమైన ప్రదేశాల వద్ద ఫొటోలు దిగుతూ సందడి చేశారు గంగవ్వ అండ్‌ టీమ్‌. ఇక దుబాయ్‌ అనగానే అందరికి గుర్తొచ్చే ప్రఖ్యాత భవనం బూర్జ్ ఖలీఫా. ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన ఈ టవర్‌పై చేయి వేసినట్లు పోజులు ఇచ్చారు గంగవ్వ. అనంతరం ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. నెటిజన్లు క్రేజీ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘ఎక్కడి లంబాడి పల్లి.. ఎక్కడి దుబాయ్‌.. హ్యాట్సాఫ్‌ గంగవ్వ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా బిగ్‌ బాస్‌ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టారు గంగవ్వ. అలాగే సిక్త్‌ సెన్స్‌ వంటి టీవీ షోల్లోనూ సందడి చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మల్లేశం, ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం, ఇస్మార్ట్‌ శంకర్‌, రాజ రాజ చోర, గాడ్‌ ఫాదర్‌, లవ్‌ స్టోరీ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారామె.

ఇవి కూడా చదవండి

దుబాయ్ పర్యటన లో గంగవ్వ..

ఫారిన్ వచ్చినాం బిడ్డ..

మై విలేజ్ షో టీమ్ తో కలిసి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల