AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ‘మా అన్నయ్యది మంచి మనసు.. అంత దారుణంగా అవమానిస్తావా?’ శోభపై మండిపడ్డ భోలే సోదరి

బిగ్‏బాస్ సీజన్ 7 నామినేషన్స్‌ ఏ రేంజ్‌లో సాగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేద. అప్పటిదాకా హౌజ్‌లో ఎంతో కలివిడిగా ఉన్న కంటెస్టెంట్లు నామినేషన్ల ప్రక్రియలో మాత్రం బద్ధ శత్రువులుగా మారిపోతారు. అలా ఏడో వారం నామినేషన్స్‌లో భాగంగా ప్రియాంక జైన్‌- భోలే షావళి- శోభా శెట్టి మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడిచింది. ఎనిమిదో వారంలోనూ వీరి ముగ్గురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Bigg Boss 7 Telugu: 'మా అన్నయ్యది మంచి మనసు.. అంత దారుణంగా అవమానిస్తావా?' శోభపై మండిపడ్డ భోలే సోదరి
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Oct 28, 2023 | 12:17 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 నామినేషన్స్‌ ఏ రేంజ్‌లో సాగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేద. అప్పటిదాకా హౌజ్‌లో ఎంతో కలివిడిగా ఉన్న కంటెస్టెంట్లు నామినేషన్ల ప్రక్రియలో మాత్రం బద్ధ శత్రువులుగా మారిపోతారు. అలా ఏడో వారం నామినేషన్స్‌లో భాగంగా ప్రియాంక జైన్‌- భోలే షావళి- శోభా శెట్టి మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడిచింది. ఎనిమిదో వారంలోనూ వీరి ముగ్గురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్‌లో శోభా శెట్టి భోలేపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ‘నీ బతుకు.. నువ్వు తినేది అన్నమేనా? నువ్వు అసలు మనిషివేనా? సిగ్గు ఉండాలి.. బుద్దిలేదు నీకు.. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యింది. అలా శోభ, ప్రియాంకే కాదు సీరియల్‌ బ్యాచ్‌ మొత్తం భోలేను టార్గెట్‌ చేసి నామినేట్‌ చేశారు. అయితే ఈ గొడవపై భోలేషావలి తల్లి ఇప్పటికే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందే. తాజాగా భోలే సోదరి బిగ్‌ బాస్‌ గొడవలపై స్పందించింది. శోభా శెట్టి, ప్రియాంక జైన్‌ తన అన్నయ్యను అనరాని మాటలు అంటున్నారంటూ వాపోయింది. ‘మా అన్నయ్యకి ఇతరులకు సాయం చేయడం తప్పితే.. గొడవలు పడడం రాదు. తనని ఎంత అసహ్యించుకున్నా ప్రేమిస్తాడు తప్పనిస్తే.. ఎదుటి వాళ్లను బాధపెట్టడం ఏ మాత్రం తెలియదు. అలాంటి మా అన్నయ్యను శోభా శెట్టి, ప్రియాంకలు దారుణంగా అవమానించారు. వారి మాటలు చూస్తుంటేనే రక్తం ఉడికిపోతుంది’

‘ శోభాశెట్టి మా అన్నయ్య ఏదైనా మాట్లాడుతుంటే చాలు మీద పడిపోతుంది. తను అలా మా అన్నయ్య మీదికి అలా వచ్చి నోరు పారేసుకుంటుంటే.. మా రక్తం ఉడికిపోతుంది. వాళ్లు చాలా తప్పు చేస్తున్నారు. బిగ్‌బాస్ షోను అందరూ చూస్తున్నారు కదా.. ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో జనాలే నిర్ణయిస్తారు. శోభాశెట్టి, ప్రియాంకలు ఆట ఆడటం సంగతి పక్కన పెడితే.. వాళ్ల ప్రవర్తన నిస్సిగ్గుగా ఉంది. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వారే కాదు సీరియల్ బ్యాచ్‌ మొత్తం కావాలనే మా అన్నయ్యను టార్గెట్ చేస్తున్నారు. హౌజ్‌ నుంచి బయటకు పంపేయాలనే చూస్తున్నారు. అందుకే పట్టు బట్టి నామినేట్‌ చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ షో చూసే వారెవరికైనా ఇది అర్థమవుతుంది. మా అన్నయ ఎలాంటివాడో అతని గురించి తెలిసిన వాళ్లని అడిగి తెలుసుకోండి’ అని చెప్పుకొచ్చింది భోలే చెల్లెలు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లో భోలే షా వలి, ప్రియాంక, నేహా వాగ్వాదం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..