Brahmamudi, October 28th episode: స్వప్నకి అబార్షన్ కాలేదని టెన్షన్ లో రుద్రాణి.. మరోవైపు కావ్య, రాజ్ ల రొమాన్స్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్నకి అబార్షన్ జరుగుతుందేమోనని రాహుల్, రుద్రాణిలు ఎదురు చూస్తున్నారు. రుద్రాణి అయితే స్వప్న డోర్ ఎదురుగా ఉండి చూస్తుంది. ఈలోపు కనకం వచ్చి రుద్రాణిని పిలిచినా.. పట్టించుకోవడం లేదు. ఏమైనా వినిపిస్తుందా అని కనకం అడిగి.. ఏమీ వినిపించడం లేదని రుద్రాణి చెప్తుంది. ఈలోపు రుద్రాణికి తెలివి వచ్చి చూసి.. షాక్ అవుతుంది. ఇందాక వాళ్లు పోట్లాడుకోవడం చూశాను.. అందుకే ఏమైనా గొడవ పడుతున్నారేమోనని చూస్తున్నాను. ఆ తర్వాత కాసేపు కనకం, రుద్రాణి గొడవ పడతారు. కావ్య తల స్నానం చేసి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్నకి అబార్షన్ జరుగుతుందేమోనని రాహుల్, రుద్రాణిలు ఎదురు చూస్తున్నారు. రుద్రాణి అయితే స్వప్న డోర్ ఎదురుగా ఉండి చూస్తుంది. ఈలోపు కనకం వచ్చి రుద్రాణిని పిలిచినా.. పట్టించుకోవడం లేదు. ఏమైనా వినిపిస్తుందా అని కనకం అడిగి.. ఏమీ వినిపించడం లేదని రుద్రాణి చెప్తుంది. ఈలోపు రుద్రాణికి తెలివి వచ్చి చూసి.. షాక్ అవుతుంది. ఇందాక వాళ్లు పోట్లాడుకోవడం చూశాను.. అందుకే ఏమైనా గొడవ పడుతున్నారేమోనని చూస్తున్నాను. ఆ తర్వాత కాసేపు కనకం, రుద్రాణి గొడవ పడతారు. కావ్య తల స్నానం చేసి.. ప్రేమగా రాజ్ దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకోబోతుంది. రాజ్ లేవడం చూసి వెంటనే తల తుడుచుకున్నట్టు నటిస్తుంది. ఈలోపు రాజ్ లేచి కావ్యని చూస్తాడు. ఒక్కసారిగా రాజ్ అంతరాత్మ వచ్చి కావ్యని పట్టుకోవాలని చూస్తాడు. కావ్యని నువ్వు పట్టుకుంటే చంపేస్తా అని అంటాడు. ఎందుకు పట్టుకోకూడదు.. జలసీనా అని అడుగుతాడు. అదేమీ కాదని రాజ్ చెప్తే.. ఏమీ లేనప్పుడు ఇంకెందుకు అని అంతరాత్మ పట్టుకోబోతే.. ఈలోపు రాజ్ వెళ్లి కావ్యని పట్టుకుంటాడు. సరిగ్గా అదే టైమ్ కి ధాన్య లక్ష్మి వచ్చి కావ్యా అని పిలుస్తుంది. ఇలాంటివి ఉన్నప్పుడు డోర్ వేసుకోవాలి కదా అని అంటుంది. సరే కిందకు వచ్చి సీమంతం పనులు చూడు అని చెప్పి వెళ్లి పోతుంది ధాన్య లక్ష్మి. ఈ టార్చర్ ఏంటిరా అని రాజ్ తల పట్టుకుంటాడు.
స్వప్న అబార్షన్ కోసం వెయిట్ చేస్తున్న రుద్రాణి:
స్వప్న కోసం ఉదయాన్నే నిద్ర లేచి ఎదురు చూస్తుంది రుద్రాణి. ఏమైంది రాత్రి ఇచ్చిన ట్యాబ్లెట్స్ పని చేశాయా.. లేదా? ఏమీ సౌండ్స్ రావడం లేదేంటి? అని రుద్రాణి అనుకుంటుంది. అయితే కనకం రావడాన్ని చూసి.. అమ్మో రాత్రి ఇక్కడ చూసి నన్ను అనుమానించింది. మళ్లీ ఇక్కడే ఉంటే అనుమానిస్తుందేమో అని అక్కడే ఉన్న చీపురుతో ఊడుస్తుంది రుద్రాణఇ. అది చూసిన కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది. రుద్రాణి ఇది కలా.. నిజమా.. అని అడుగుతుంది కనకం. కలకి నిజానికి తేడా తెలీనంత ఊహల్లో బ్రతుకుతున్నావా.. అని రుద్రాణి అడిగితే.. ఆ పని చేసేది మీరు కదా అని కనకం రిప్లై ఇస్తుంది. ఎప్పుడైనా మీరు వేరే వాళ్లతో పని చేయిస్తారు కానీ.. మీరు పని చేయడం ఎప్పుడూ చూడలేదండి అందుకే ఆశ్చర్య పోతున్నా అని కనకం అంటుంది. నువ్వేమన్నా పుట్టినప్పటి నుండి ఈ ఇంట్లో ఉంటున్నావా.. నేనేంటో తెలీడానికి.. నా పనులు ఎప్పుడూ నేనే చేసుకుంటా.. అని రుద్రాణి చెప్తుంది.
స్వప్నకి అబార్షన్ కాలేదని షాక్ అయిన రుద్రాణి, రాహుల్:
ఈ లోపు రాహుల్ వచ్చి మామ్ అని పిలుస్తాడు. ఏంట్రా నీ కోసం ఎంత వరకూ వెయిట్ చేయాలి? రాత్రి నీకో పని అప్పజెప్పాను అది ఏమైందో చెప్పాలి కదా అని రుద్రాణి అంటే.. ఏంటి చెప్పేది నువ్వు చెప్పినట్టు అక్కడ ఏం జరగలేదని రాహుల్ అంటాడు. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఏదో స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టు దున్నపోతులా పడుకుందని అంటాడు రాహుల్. అలా జరగకూడదే అని రుద్రాణి అంటే.. అలాగే జరిగిందని రాహుల్ చెప్తాడు. ఈలోపు స్వప్న గట్టిగా అరుస్తుంది. ఈ అరుపు విని రుద్రాణి, రాహుల్, పరిగెత్తుకుంటూ వెళ్తారు. లోపల బల్లి ఉందని గట్టిగా అరిచి చెప్తుందని స్వప్న అంటుంది. ఇక రాహుల్, రుద్రాణిలు స్వప్నని తిడతారు. వెళ్లు ఫ్రెష్ అవ్వు అంటాడు రాహుల్ చిరాకుతో. ఇదేంటి దీనికేం కాలేదు అని రుద్రాణి అమాయకంగా అడుగుతుంది. ఆ విషయం నన్ను కాదు.. ఆ డాక్టర్ ని అడుగు. ఇప్పుడు సీమంతంలో అందరి ముందు నవ్వుతూ నటించి చావాలి అని చిరాకుతో వెళ్లి పోతాడు రాహుల్.
రాజ్ కి డ్రెస్ తీసుకొచ్చిన కావ్య:
ఇక రాజ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి కావ్య కాఫీ కప్పుతో రెడీగా ఉంటుంది. అదేంటి నువ్వు కాఫీ తీసుకొచ్చావ్ అని రాజ్ అడిగితే.. ప్రతి రోజూ నేనే కదా మీకు ఇచ్చేది అని కావ్య చెప్తుంది. కానీ నీకు ఈ రోజు ఇంట్లో చాలా పని ఉంటుంది కదా అని రాజ్ అంటే.. ఇప్పుడు కూడా మీతో పని ఉండే వచ్చాను అని చెప్తుంది. పనంటే పని కాదు.. మీకొకటి ఇద్దామని అని చెప్తుంది కావ్య. ఇదిగోండి ఇది వేసుకోండి అని కావ్య ఇస్తుంది. ఏంటా అని చూస్తుంది రాజ్. నేనే మీ కోసం తీసుకొచ్చాను అని కావ్య చెప్పగా.. ఎందుకు నా దగ్గర చాలా ఉన్నాయి కదా అని రాజ్ అంటాడు. ఎన్ని ఉన్నా మన ఇద్దరికీ ఒకలాంటి కలర్ లేదు కదా అని కావ్య అంటుంది. ఫంక్షన్ లో ఇద్దరం ఒకటే కలర్ డ్రెస్ లో ఉండాలనేది నా కోరిక అని చెప్తుంది.
డాక్టర్ కి కాల్ చేసి తిట్టిన రుద్రాణి.. కడుపు కాదన్న డాక్టర్:
ఈలోపు రుద్రాణి.. డాక్టర్ కి కాల్ చేసి ఎంబీబీఎస్ చేశావా లేక దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్నావా అని అడుగుతుంది. అంత పెద్ద తప్పు నేనేం చేశాను అని డాక్టర్ అడుగుతుంది. అబార్షన్ అవ్వాలని ట్యాబ్లెట్స్ అడిగాను. దానికి నువ్వేం ఇచ్చావ్.. నువ్వు అడిగిందే ఇచ్చాను. మరి అబార్షన్ ఎందుకు అవలేదు. ఏంటి అని డాక్టర్ షాక్ అవుతుంది. అవ్వకుండా అయ్యే ఛాన్సే ఉండదు. మీరు నేను చెప్పిన ట్యాబ్లెట్స్ కి బదులు వేరే ఇచ్చావా.. లేకపోతే ఆ పర్సన్ కి కడుపు అయినా లేకపోయి ఉండాలి. లేదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది. తను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు.. అబార్షన్ అయి తీరాలి అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పి తీరుతుంది. దీంతో రుద్రాణి కన్ ఫ్యూజన్ లో పడుతుంది.
స్వప్న సీమంతం ఫంక్షన్ కి వచ్చిన కృష్ణమూర్తి, అప్పూ:
సీమంతం వేడుకకి అంతా రెడీ అవుతుంది. ఈలోపు అపర్ణ.. ధాన్య లక్ష్మిని పిలిచి చీర, గాజులు, గంధం గురించి చెప్తుంది. అప్పుడే కృష్ణ మూర్తి, అప్పూ వస్తారు. వాళ్లను చూసిన కనకం.. ఇంత లేటుగా వచ్చారేంటి? నేను చెప్పిన చీరా, సారె, గాజులు తెచ్చారా అని చెప్తుంది.. అన్నీ తెచ్చామని అప్పూ చెప్తుంది. ఇది మీ అక్క సీమంతమే.. నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి అని కనకం అడిగితే.. కావ్య అక్కకి సీమంతం అని చెప్పు.. టన్నుల కొద్దీ సంతోష పడతా అని అప్పూ అంటుంది. స్వప్న కూడా మీ అక్కేనే అని కనకం అంటుంది. ఆ విషయం అప్పుడప్పుడూ గుర్తు చేస్తూ ఉండు అని అప్పూ ఎగతాళి చేస్తుంది. ఎంత సేపు అయింది వచ్చి.. టీ ఏమైనా తాగుతారా అని కావ్య అడుగుతుంది. దానికి అప్పూ మీ ఇంట్లో టీ షాపు ఏమైనా ఉందా.. ఎప్పుడొచ్చినా టీ రెడీగా ఉంటుందని సెటైర్లు వేస్తుంది. దానికి రాజ్ నవ్వుతాడు. సరే నువ్వు మొన్న పండుగలో నుంచి వెళ్లిపోయినట్టు వెళ్లిపోకు.. ఈరోజు నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి అని కావ్య అంటే.. అందుకే వచ్చాను నువ్వు చెప్తూ ఉండు.. నేను చేసుకుంటూ పోతా అని అప్పూ చెప్తుంది.
కావ్యపై మళ్లీ నోరు పారేసుకున్న రుద్రాణి:
వదినా.. బ్రోతో పాటు నేను కూడా ఉన్నాను.. ఇద్దరం కలిసి పనులన్నీ చేసేస్తాం అని కళ్యాణ్ చెప్తాడు. ఏ.. ఈ రోజు మీ అనామకురాలు రాలేదా అని అప్పూ అడుగుతుంది. ష్.. అప్పూ అని కావ్య పిలుస్తుంది. ఏదో ఒకటిలే అని అప్పూ సమాధానం ఇస్తుంది. ఈలోపు అపర్ణ దేవి.. రాజ్ ని పిలిచి బట్టలు ఇస్తుంది. ఫంక్షన్ లో నువ్వు ఇవే వేసుకోవాలి అని చెప్తుంది. అది చూసిన రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఈలోపు కావ్య వచ్చి చాలా బావుంది అత్తయ్యా.. మీరు దీన్నే వేసుకోండి చాలా బావుంటుందని చెప్తుంది. రాజ్ కి ఏది బావుంటుందో నాకు బాగా తెలుసు.. నీ రికమెండేషన్ అవసరం లేదని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రుద్రాణిని పిలుస్తుంది అపర్ణ.. నిన్ను గుడికి వెళ్లి అమ్మవారికి అభిషేకం చేయించిన కుంకుం తీసుకురమ్మన్నా కదా తెచ్చావా అని అడుగుతుంది. వదిన అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి కావ్య అని అడుగుతుంది రుద్రాణి. నన్ను అడుగుతున్నారేంటి? అని కావ్య అడిగితే.. అదేంటి ఇందాక నీకు చెప్పాగా మర్చిపోయావా.. నాకు పని ఉంది నువ్వు వెళ్లి తీసుకు రమ్మని చెప్పాను మర్చిపోయావా అని రుద్రాణి అంటుంది. ఇక ఆ తర్వాత కావ్య పై నోరు పారేసుకుంటుంది రుద్రాణి. ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్లీ సోమవారం ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.