Jailer Movie: టీవీలోకి వచ్చేస్తోన్న రజనీకాంత్ ‘జైలర్‌’.. ఏ ఛానెల్‌లో, ఎప్పుడు టెలికాస్ట్‌ కానుందంటే?

ఆగస్టు 10 న థియేటర్లలో రిలీజైన జైలర్‌ బాక్సాఫీస్‌ రికార్డులన్నీ కొల్లగొట్టింది. ముఖ్యంగా రజనీకి గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ మూవీగా నిలిచింది. థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ తలైవా సినిమాకు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కు వచ్చిన జైలర్‌ సినిమా విదేశీ భాషల్లోనూ మంచి వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఇలా థియటేర్లు, ఓటీటీలో సూపర్‌ హిట్‌గా నిలిచిన జైలర్‌ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది

Jailer Movie: టీవీలోకి వచ్చేస్తోన్న రజనీకాంత్ 'జైలర్‌'.. ఏ ఛానెల్‌లో, ఎప్పుడు టెలికాస్ట్‌ కానుందంటే?
Jailer Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2023 | 12:48 PM

గత కొన్నేళ్లుగా వరుస ప్లాఫ్‌లతో సతమతవుతోన్న రజనీకాంత్‌ జైలర్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ రీ కొట్టేశారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ యాక్షన్‌ డ్రామా ఓవరాల్‌గా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ కోవలో తమిళ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు తలైవా. నెల్సన్‌ దీలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన జైలర్‌ సినిమాలో రజనీతో పాటు కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌, మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 10 న థియేటర్లలో రిలీజైన జైలర్‌ బాక్సాఫీస్‌ రికార్డులన్నీ కొల్లగొట్టింది. ముఖ్యంగా రజనీకి గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ మూవీగా నిలిచింది. థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ తలైవా సినిమాకు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కు వచ్చిన జైలర్‌ సినిమా విదేశీ భాషల్లోనూ మంచి వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఇలా థియటేర్లు, ఓటీటీలో సూపర్‌ హిట్‌గా నిలిచిన జైలర్‌ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. రజనీ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ జెమిని సొంతం చేసుకుంది. త్వరలో ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.

నవంబర్‌ రెండో వారం లేదా దీపావళి పండగ సందర్భంగా జైలర్‌ సినిమాను ప్రసారం చేయవచ్చని టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రానుందని సమాచారం. సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన జైలర్‌ సినిమాకు అనిరుధ్‌ రవి చందర్‌ స్వరాలు సమకూర్చారు. సినిమా విజయంలో అనిరుధ్‌ బీజీఎమ్‌ కూడా కీలక పాత్ర పోషించింది. కాగా జైలర్‌ సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత కళానిధి మారన్‌ రజనీకాంత్‌, డైరెక్టర్‌ నెల్సన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌కు లగ్జరీ కార్లు బహుమతిగా ఇచ్చారు. అలాగే సినిమా యూనిట్‌కు కూడా వివిధ కానుకలను ఇచ్చారు. మరి థియేటర్లలో, ఓటీటీలో హిట్ బొమ్మగా నిలిచిన జైలర్ టీవీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

రజనీకాంత్ కు బహుమతిగా లగ్జరీ కారు ..

View this post on Instagram

A post shared by Sun Pictures (@sunpictures)

జైలర్ నిర్మాతల విరాళం..

View this post on Instagram

A post shared by Sun Pictures (@sunpictures)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..