Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yatra 2: వైఎస్‌ జగన్‌ బయోపిక్‌ ‘యాత్ర 2’ నుంచి మరో అప్డేట్‌.. చంద్రబాబు పాత్రలో ఆ స్టార్‌ విలన్‌

యాత్ర 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌ పార్ట్‌ షూటింగ్ చాలా వరకు పూర్తైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8నే యాత్ర 2 కూడా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తన సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్‌ ఇస్తున్నారు. కాగా యాత్ర సినిమాలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి జీవించారు. అలాగే రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ స్నేహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్..

Yatra 2: వైఎస్‌ జగన్‌ బయోపిక్‌ 'యాత్ర 2' నుంచి మరో అప్డేట్‌.. చంద్రబాబు పాత్రలో  ఆ స్టార్‌ విలన్‌
Yatra 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 27, 2023 | 1:41 PM

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని ప్రముఖ డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన చిత్రం యాత్ర. మొత్తం రెండు భాగాలుగా ఈ మూవీని రూపొందించగా, ఫస్ట్‌ పార్ట్‌ 2019 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైంది. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు సంబంధించిన అంశాలను చూపించారు. ఇక ఇప్పుడీ పొలిటికల్‌ డ్రామాకు సీక్వెల్‌ కూడా వస్తోంది. యాత్ర 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీక్వెల్‌ పార్ట్‌ షూటింగ్ చాలా వరకు పూర్తైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8నే యాత్ర 2 కూడా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తన సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్‌ ఇస్తున్నారు. కాగా యాత్ర సినిమాలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి జీవించారు. అలాగే రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ స్నేహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషించి మెప్పించారు. ఇక యాత్ర 2లోనూ మమ్ముట్టి కనిపించనున్నారు. ఇక వైఎస్సార్‌ కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పాత్రలో ప్రముఖ కోలీవుడ్‌ నటుడు జీవా కనిపించనున్నారు. ఇప్పటికే అతని లుక్‌కు సంబంధించిన పోస్టర్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా యాత్ర 2 నుంచి మరో సాలిడ్‌ అప్డేట్‌ వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీలో చంద్రబాబు నాయుడి పాత్రకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ను ఎంపిక చేశారు.

ఇక యాత్ర 2లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రకు ప్రముఖ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్‌ను ఎంపిక చేశారు. ఎక్కువగా హిందీ సినిమాల్లో కనిపించే ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం. గోపీచంద్‌ ఒక్కడున్నాడు, ఎన్టీఆర్‌ అదుర్స్‌, జగపతి బాబు హోమం, గుంటూర్‌ టాకీస్‌ సినిమాల్లో వివిధ పాత్రల్లో మెరిశాడు మహేష్‌ మంజ్రేకర్‌. ఇక ప్రభాస్‌ నటించిన సాహో సినిమాలో స్టైలిష్‌ విలన్‌గానూ మెప్పించాడు. ఇప్పుడు యాత్ర 2 సినిమాలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్రలో కనిపించనున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక యాత్ర 2 సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే యాత్ర 2 సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మహేష్ మంజ్రేకర్ లేటెస్ట్ ఫొటోస్..

యాత్ర 2 లో జగన్ లుక్..

View this post on Instagram

A post shared by Mahi V Raghav (@mahivraghav)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
విజయాల లక్నో, పరాజయాల చెన్నై.. గెలుపు ఎవరిదో తెలుసుగా మచ్చా?
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా