Bigg Boss 7 Telugu: ‘ మనసులో ఉండిపోయిన మాటలు బాధపెడుతూనే ఉంటాయి’.. రతికకు దూరంగా ప్రశాంత్..

అమ్మా నాన్న నిన్ను ఇలాగే పెంచారా ?.. అంటూ ఫ్యామిలీని అవమానించింది. పల్లవి ప్రశాంత్ పెద్ద తప్పు చేసినట్లుగా అతడిని దారుణంగా తిట్టేసింది. రతిక కాదు అక్కా అని పిలువు అంటూ పెద్ద రాద్ధంతమే చేసింది. దీంతో దెబ్బకు అక్కా.. అక్కా క్షమించు అంటూ దండం పెట్టేశాడు పల్లవి ప్రశాంత్. ఇక ఎలిమినేట్ అయ్యాక.. కనీసం ముఖం చూడకుండా హౌస్ నుంచి బయటకు వెళ్లింది రతిక. కానీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ఆట తీరులో మార్పు వచ్చేసింది.

Bigg Boss 7 Telugu: ' మనసులో ఉండిపోయిన మాటలు బాధపెడుతూనే ఉంటాయి'.. రతికకు దూరంగా ప్రశాంత్..
Rathika, Prashanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2023 | 2:01 PM

మనసుకు తాకిన కఠిన మాటలు ఎప్పటికీ మనలోనే ఉండిపోయి బాధపెడుతూనే ఉంటాయి. స్నేహితులు అనుకున్న మనుషులు అన్న మాటలు మనిషిని చాలా మార్చేస్తాయి. చివరకు స్నేహాన్ని దూరం చేస్తాయి. ఒక్కసారి కాదుకుని నోరుజారిన తర్వాత మళ్లీ కలవాలనుకున్న ఆ స్నేహం మునుపటిలా ఉండదు.. ఇప్పుడిదే బిగ్‎బాస్ హౌస్ లో ప్రశాంత్, రతిక మధ్య జరుగుతుంది. రైతు బిడ్డగా ఇంట్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‏తో మాట కలిపింది. స్నేహం చేసింది. మనసులో ఎవరున్నారు ?.. హార్ట్ ఎవరికిస్తావ్ ? అంటూ ప్రేమ పిచ్చొడిని చేసింది. చివరకు అతడికే వెన్నుపోటు పొడిచింది. బిగ్‎బాస్ లోకి రావాలని కుక్కలా తిరిగి.. ఇక్కడకు వచ్చి ఏం చేస్తున్నావ్ అంటూ రివర్స్ అయ్యింది. దీంతో రైతు బిడ్డా ఫ్యూజుల్ ఔట్. అయినా మనమ్మాయే కదా అని మళ్లీ మాట కలిపాడు. అయినా తన ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. చివరకు నువ్వేవడ్రా అంటూ గట్టిగానే క్లాస్ తీసుకుంది. అమ్మా నాన్న నిన్ను ఇలాగే పెంచారా ?.. అంటూ ఫ్యామిలీని అవమానించింది. పల్లవి ప్రశాంత్ పెద్ద తప్పు చేసినట్లుగా అతడిని దారుణంగా తిట్టేసింది. రతిక కాదు అక్కా అని పిలువు అంటూ పెద్ద రాద్ధంతమే చేసింది. దీంతో దెబ్బకు అక్కా.. అక్కా క్షమించు అంటూ దండం పెట్టేశాడు పల్లవి ప్రశాంత్. ఇక ఎలిమినేట్ అయ్యాక.. కనీసం ముఖం చూడకుండా హౌస్ నుంచి బయటకు వెళ్లింది రతిక. కానీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ఆట తీరులో మార్పు వచ్చేసింది. అందరితో ఆచి తూచి మాట్లాడుతుంది. ముఖ్యంగా శివాజీ, యావర్‍లకు దగ్గరయ్యేందుకు ట్రై చేస్తుంది. ఎక్కువ సమయంలో వారితో మాట్లాడుతూనే కనిపిస్తోంది.

అయితే రతిక రీఎంట్రీ వచ్చినా.. ప్రశాంత్ మాత్రం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆమెకు దూరంగా ఉండేందుకు ట్రై చేస్తున్నాడు. అయితే ఇదే విషయాన్ని శివాజీ, యావర్ ముందు చెప్పుకొని బాధపడింది రతిక. ప్రశాంత్ నాతో ఎందుకు అలా ఉంటున్నాడు ?.. వచ్చిన రోజు నుంచి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడు. నాతో మాట్లాడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శివాజీ మాట్లాడుతూ నేను మాట్లాడను.. ప్రశాంత్ కు చెప్పాను మాట్లాడు అని అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ విషయంపై యావర్ మధ్యవర్తిత్వం తీసుకున్నాడు. ఇద్దరిని ఓ చోట కూర్చొబెట్టి ఆ పంచాయితీ తేల్చేందుకు ట్రై చేశాడు. దీంతో తన మనసుకు బాధ పెట్టిన మాటలను బయటకు చెప్పేశాడు ప్రశాంత్.

నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని రతిక అడగ్గా.. మాట్లాడుతున్నా కదా అని అన్నాడు ప్రశాంత్. నన్ను అక్కా అని పిలవడం నచ్చలేదు. రతిక అని పిలువు. బయటకు వెళ్లాక నీ ఇష్టం అని అన్నది రతిక. లేదు నేను అక్కా అని పిలుస్తా.. నువ్వే అక్కా అని పిలవమన్నావ్ నేను అలాగే పిలుస్తా అంటూ కౌంటరిచ్చాడు ప్రశాంత్. ఆరోజు నీకు నచ్చని పల్లవి ప్రశాంత్.. ఇప్పుడెందుకు అలా పిలవడం నచ్చట్లేదు అనేది నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్. ఇక వీరిద్దరి మధ్య వాదోపవాదనలు జరుగుతుండగా.. యావర్ కల్పించుకుని ప్రశాంత్ ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ మొదటి నుంచి ప్రశాంత్ తప్పు ఉన్నట్లుగానే మరోసారి మాట్లాడింది రతిక. అయితే ఆమె మాటలకు పాయింట్ పాయింట్ తీస్తూ మాట్లాడుతూ.. నేనేమన్నా పిచ్చోడినా.. ఆరోజు నచ్చలేదు.. ఈరోజు ఎందుకు మాట్లాడాలి అన్నాడు ప్రశాంత్.

ఫస్ట్ నేను నీతోనే మాట్లాడాను. నీతోనే ఎక్కువగా ఉన్నా.. మనోళ్లు అనిపించి నీతో ఉన్నాను. కానీ నువ్వు టాస్క్ రోజు మా అమ్మ, నాన్నను అన్నావు. నన్ను మస్త్ తిట్టినవ్. మొన్న మా నాన్నను టీవీలో చూసి బాధేసింది. ఇప్పటికీ అదే మనసులో ఉండిపోయింది. ఆ బాధలోనే ఉన్నాను. నా వల్ల నువ్వు బాధపడిన అని ఆరోజు చెప్పావు.. ఇప్పుడు చెప్తున్నావ్. అందుకు ఎన్నిసార్లు అయిన సారీ చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మొత్తానికి తన గేమ్ కోసం ప్రశాంత్ కు వెన్నుపోటు పొడిచిన రతికకు ఇప్పుడు షాకిచ్చాడు ప్రశాంత్.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..