Bigg Boss Telugu 7: ‘నా కొడుకు అమర్‌కు ఓటేయ్యండి’.. నటి రాశి రిక్వెస్ట్‌.. రెచ్చిపోయిన రైతు బిడ్డ ఫ్యాన్స్‌

బుల్లితెరపై మంచి టీఆర్పీ రాబడుతోన్న జానకి కలగనలేదు సీరియల్‌లో రాశి, అమర్‌ దీప్‌ చౌదరి తల్లీ కొడుకులుగా నటించారు. జ్ఞానాంబ పాత్రలో రాశి, ఆమె కుమారుడిగా రామా అమర్‌ దీప్‌ నటించి మెప్పించారు. ఇక జానకిగా ప్రియాంక నటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమర్‌ దీప్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌కు వెళ్లడంతో తన కొడుకుకు ఓటేయమంటూ రాశి ఒక వీడియోను విడుదల చేసింది

Bigg Boss Telugu 7: 'నా కొడుకు అమర్‌కు ఓటేయ్యండి'.. నటి రాశి రిక్వెస్ట్‌.. రెచ్చిపోయిన రైతు బిడ్డ ఫ్యాన్స్‌
Bigg Boss Telugu 7
Follow us
Basha Shek

|

Updated on: Oct 27, 2023 | 12:52 PM

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పటికే ఎనిమిదో వారం వీకెండ్‌లోకి అడుగుపెట్టిందీ రియాలిటీ షో. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లందరూ తమ దైశ శైలిలో గేమ్స, టాస్కుల్లో పాల్గొంటున్నారు. అలాగే బయటి నుంచి పలువురు ప్రముఖులు, బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్లు హౌజ్‌ మేట్స్‌కు సపోర్టుగా మాట్లాడుతున్నారు. అలా తాజాగా అమర్‌ దీప్‌ చౌదరికి సపోర్టుగా నిలిచింది అలనాటి హీరోయిన్‌, ప్రముఖ సీనియర్‌ నటి రాశి. తన కొడుకుని గెలిపించాలంటూ ఒక వీడియో విడుదల చేసిందీ అందాల తార. బుల్లితెరపై మంచి టీఆర్పీ రాబడుతోన్న జానకి కలగనలేదు సీరియల్‌లో రాశి, అమర్‌ దీప్‌ చౌదరి తల్లీ కొడుకులుగా నటించారు. జ్ఞానాంబ పాత్రలో రాశి, ఆమె కుమారుడిగా రామా అమర్‌ దీప్‌ నటించి మెప్పించారు. ఇక జానకిగా ప్రియాంక నటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమర్‌ దీప్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌కు వెళ్లడంతో తన కొడుకుకు ఓటేయమంటూ రాశి ఒక వీడియోను విడుదల చేసింది. ‘నేను మీ రాశిని.. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం నా కుమారుడు రామా (అమర్‌ దీప్‌ చౌదరి) . ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7లో నా కుమారుడు ఉన్నాడు. మీరంతా చూస్తున్నారు. రామా చాలా బాగా గేమ్‌ ఆడుతున్నాడు. నా సపోర్ట్ కచ్చితంగా రామాకే. మీరంతా అమర్‌కి మద్దతుగా నిలిచి గెలిపిస్తారని కోరుతున్నాను. దయచేసి అమర్ దీప్‌ చౌదరికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది రాశి. ఈ వీడియో రిలీజ్‌ చేసిన క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అమర్‌ దీప్‌కు సపోర్టుగా నటి రాశి అలా వీడియో రిలీజ్‌ చేయడమే లేటు..మరుక్షణమే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ లైన్‌లోకి వచ్చారు. రాశిని ట్రోల్‌ చేస్తూ కామెంట్లు పెట్టారు. ‘మీరు చెబితే మేం ఓటు వేయాలా? మా ఓటు రైతు బిడ్డకే’, ‘సీరియల్‌ బ్యాచ్‌ అందరూ గకలిసి గ్రూపిజం అడుతున్నారు మేడమ్‌. అతనికి ఎందుకు ఓటేయాలి?, ‘ప్రతిసారి రైతు బిడ్డనే టార్గెట్‌ చేస్తున్నారు’, ‘అసలు అమర్‌కు సరిగా మాట్లాడడమే రాదు’, ‘దయచేసి అతనికి ఓటు వేయమని అడగకండి మేడం’ అని కామెంట్లు పెట్టారు రైతు బిడ్డ ఫ్యాన్స్‌. మీరు అసలు బిగ్‌ బాస్‌ షోను చూస్తున్నారా? గేమ్స్‌ ఆడడం లేదు, ఏవేవో మాట్లాడుతు్నాడు? అసలు అమర్‌కు ఎందుకు ఓటేయాలి మేడమ్‌’ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 అమర్ కు సపోర్టుగా రాశి రిలీజ్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!