AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda OTT: ఉస్తాద్‌ రామ్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా! కారణమిదే

యంగ్ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పొతినేని హీరోగా నటించిన చిత్రం స్కంద. ఊర మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీను తెరకెక్కించిన ఈ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో యంగ్ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజేక్రర్‌ సెకెండ్‌ లీడ్‌ రోల్‌ పోషించింది. టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్లతో స్కంద సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సెప్టెంబర్‌ 28న రిలీజైన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

Skanda OTT: ఉస్తాద్‌ రామ్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద ఓటీటీ స్ట్రీమింగ్‌ వాయిదా! కారణమిదే
Skanda Movie
Basha Shek
|

Updated on: Oct 26, 2023 | 4:37 PM

Share

యంగ్ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పొతినేని హీరోగా నటించిన చిత్రం స్కంద. ఊర మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీను తెరకెక్కించిన ఈ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో యంగ్ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజేక్రర్‌ సెకెండ్‌ లీడ్‌ రోల్‌ పోషించింది. టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్లతో స్కంద సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సెప్టెంబర్‌ 28న రిలీజైన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ముఖ్యంగా ఇప్పటివరకు లవర్‌ బాయ్‌గా, స్టైలిష్‌ హీరోగా కనిపించిన ఉస్తాద్‌ రామ్‌ మొదటి సారి ఊర మాస్‌ రోల్‌లో కనిపించి ఆడియెన్స్‌ను మెప్పించాడు. ఇక ఎప్పటిలాగే శ్రీలీల తన దైన యాక్టింగ్‌, స్టెప్పులతో అదరగొట్టింది. అలాగే ఎప్పటిలాగే బోయపాటి మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ స్కంద సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఎప్పుడెప్పుడు రామ్‌ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందా? అని ఉస్తాద్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ స్కంద మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది. అక్టోబర్‌ 27 (శుక్రవారం) నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. అంటే ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచే స్కంద సినిమా స్ట్రీమింగ్‌ కు రావాల్సి ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈమూవీని స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అటు చిత్ర బృందం నుంచి కానీ, ఇటు డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు స్కంద సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విడుదల వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. నవంబర్‌ రెండో వారంలో ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ఓటీటీలో తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా స్కంద ఓటీటీ రిలీజ్‌ వాయిదాకు దీనికి టెక్నికల్ రీజన్సే కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. మరోవైపు ఈ విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ‘రామ్ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఏదో ఒకటి అప్‌ డేట్‌ ఇవ్వండి’ అంటూ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా స్కంద సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఈ అర్ధరాత్రి తర్వాత కానీ క్లారిటీ రాదు. ఈ సినిమాలో శ్రీకాంత్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్‌, ప్రభాకర్‌, గౌతమి, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతెలా స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్‌ చిట్టూరి, పవన్‌ కుమార్‌ సంయుక్తంగా స్కంద సినిమాను నిర్మించారు. ఎస్‌. థమన్‌ అందించిన స్వరాలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..