- Telugu News Photo Gallery Cinema photos KGF actor Yash family perform special Poojas during Navratri, See Photos
Yash- Radhika Pandit: రాకీ భాయ్ ఇంట్లో దసరా వేడుకలు.. స్టైలిష్ డ్రెస్‌లో యశ్ దంపతులు.. ఫొటోస్ చూశారా?
ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది యశ్ సతీమణి రాధికా పండిట్. తాజాగా తమ ఇంట్లో జరిగిన దసరా వేడకల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి. సంప్రదాయ దుస్తుల్లో యశ్, రాధికలు ముస్తాబైన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
Updated on: Oct 24, 2023 | 2:27 PM

కేజీఎఫ్ హీరో యశ్, రాధికా పండిట్‌లది ప్రేమ వివాహమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నేటి జనరేషన్‌కు ఈ జంట రోల్ మోడల్. సందర్భమొచ్చినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తుంటారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది యశ్ సతీమణి రాధికా పండిట్. తాజాగా తమ ఇంట్లో జరిగిన దసరా వేడకల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి. సంప్రదాయ దుస్తుల్లో యశ్, రాధికలు ముస్తాబైన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

అందుకే ఫొటోలు షేర్ చేసిన గంటలోపే మిలియన్ల కొద్దీ లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాధిక చీరలో చాలా ట్రెడిషినల్‌గా కనిపించింది.

అలాగే హీరో యశ్ కూడా కలర్ ఫుల్ దుస్తులు, కూల్ గ్లాసెస్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. ఇక యశ్ పిల్లలు వాహనాలకు పూజలు చేశారు. రాధికా పండిట్ కూడా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఐరా, యథార్వ్ క్యూట్‌గా కనిపిస్తున్నారు.

కాగా కేజీఎఫ్ 2 తర్వాత మరే సినిమాను పట్టాలెక్కించలేదు యశ్. అయితే బాలీవుడ్‌లో రూపొందుతున్న రామాయణం సినిమాలో యశ్ రావణాసురుడిగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.