World Cup 2023: రోజూ 8 కిలోల మటన్ అయితే తింటారా? పాక్‌ క్రికెటర్లను దారుణంగా తిట్టేసిన మాజీ కెప్టెన్‌

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా మారింది. భారీ ఆశలు, అంచనాలతో మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన ఆ జట్టు వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. భారత్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో ఓడిపోయిన ఆ జట్టు సోమవారం క్రికెట్‌ బేబీస్‌గా పేరున్న అఫ్గనిస్తాన్‌ చేతిలో పరాజయం పాలైంది. అది కూడా చిత్తు చిత్తుగా.

World Cup 2023: రోజూ 8 కిలోల మటన్ అయితే తింటారా? పాక్‌ క్రికెటర్లను దారుణంగా తిట్టేసిన మాజీ కెప్టెన్‌
Pakistan Cricket Team
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2023 | 2:02 PM

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా మారింది. భారీ ఆశలు, అంచనాలతో మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన ఆ జట్టు వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. భారత్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో ఓడిపోయిన ఆ జట్టు సోమవారం క్రికెట్‌ బేబీస్‌గా పేరున్న అఫ్గనిస్తాన్‌ చేతిలో పరాజయం పాలైంది. అది కూడా చిత్తు చిత్తుగా. ఈ ఓటమిని పాక్‌ క్రికెట్‌ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ క్రికెటర్ల పెర్ఫామెన్స్‌ ఏ మాత్రం బాగోలేదంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ ఆటగాళ్లు కూడా పాక్‌ క్రికెటర్లను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక పాకిస్తాన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ వసీమ్‌ అక్రమ్‌ ఒక అడుగు ముందుకేసి పాక్‌ క్రికెటర్ల ఫిట్‌నెస్‌ గురించి బూతులు తిట్లాడు. ఒక టీవీ షోలో భాగంగా వసీమ్‌ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఫిట్ నెస్ లెవెల్స్ సరి చూసుకుంటున్నారా?

‘ఇది నిజంగా పాక్‌ క్రికెట్‌కు తలవంపులే. 280-290 లాంటి భారీ స్కోరును కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించడం చాలా పెద్ద విషయం. పిచ్‌ సంగతి పక్కన పెడితే.. ఓసారి పాక్‌ ఆటగాళ్ల ఫీల్డింగ్‌ చూడండి. వీరి ఫిట్‌నెస్‌ లెవెల్స్‌ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ఫిట్‌నెస్‌ లేని క్రికెటర్ల పేర్లను ప్రస్తావిస్తే వారికి నచ్చదు కానీ.. వీళ్లు రోజుకు 8 కిలోల చొప్పున మటన్‌ తింటున్నట్లు ఉంది. ఇప్పుడు వాళ్లు దేశం తరపున క్రికెట్ ఆడేందుకు బరిలోకి దిగారు. ఇందుకు పారితోషకం కూడా తీసుకుంటున్నారు. ఒక దేశం తరఫున ప్రాతినిథ్యం వహించేటప్పుడు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉండాలి. ప్రస్తుతం మనం ఏ స్థితికి చేరుకున్నామంటే గెలుపు కోసం దేవుడిని ప్రార్థించాల్సి వస్తోంది. అది జరిగితే బాగుండు.. ఆ జట్టు ఓడిపోతే బాగుండు. సెమీస్‌కు చేరొచ్చంటూ మాట్లాడుతున్నాం’ అంటూ మాట్లాడాల్సిన కర్మ వచ్చింది’ అంటూ పాక్‌ క్రికెటర్లపై పరుష పదజాలంతో మండి పడ్డారు అక్రమ్‌. ప్రస్తుతం ఇతని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

వసీమ్ అక్రమ్ సంచలన వ్యాఖ్యలు..

పాకిస్తాన్ క్రికెటర్ల పేలవ ఫీల్డింగ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..