Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ పొలంలో మొలకలొచ్చాయ్‌.. రతికకు రసగుల్లాతో స్వాగతం పలికిన పల్లవి ప్రశాంత్‌

బిగ్‌బాస్‌ నాలుగో వారంలో ఎలిమినేట్‌ అయిన రతికా పాప మళ్లీ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున ఇచ్చిన గోల్డెన్‌ ఆఫర్‌ను బాగా సద్వినియోగం చేసుకున్న ఈ హాట్‌ బ్యూటీ ఆదివారం మళ్లీ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. తాను పూర్తిగా మారిపోయానని, ఈసారి టాప్‌ లెవెల్‌లో తన పెర్ఫామెన్స్‌ ఉంటుందంటూ నాగార్జునకు ప్రామిస్‌ చేసి మరీ హౌజ్‌లోకి వచ్చింది రతికా పాప. బిగ్‌ బాస్‌ హౌజ్‌ మేట్స్‌ కూడా ఆమెకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు.

Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ పొలంలో మొలకలొచ్చాయ్‌.. రతికకు రసగుల్లాతో స్వాగతం పలికిన పల్లవి ప్రశాంత్‌
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 23, 2023 | 1:45 PM

బిగ్‌బాస్‌ నాలుగో వారంలో ఎలిమినేట్‌ అయిన రతికా పాప మళ్లీ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున ఇచ్చిన గోల్డెన్‌ ఆఫర్‌ను బాగా సద్వినియోగం చేసుకున్న ఈ హాట్‌ బ్యూటీ ఆదివారం మళ్లీ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. తాను పూర్తిగా మారిపోయానని, ఈసారి టాప్‌ లెవెల్‌లో తన పెర్ఫామెన్స్‌ ఉంటుందంటూ నాగార్జునకు ప్రామిస్‌ చేసి మరీ హౌజ్‌లోకి వచ్చింది రతికా పాప. బిగ్‌ బాస్‌ హౌజ్‌ మేట్స్‌ కూడా ఆమెకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. ముందుగా బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీని ప్రసన్నం చేసుకున్న రతిక ఆయన కాళ్లు మొక్కి మరీ క్షమాపణలు చెప్పింది. బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌ సమయంలో తన గురించి మాట్లాడనందుకు క్షమించాలంటూ వేడుకుంది. ఆ తర్వాత కంటెస్టెంట్లు ఒక్కొక్కరు రతికకి స్వాగతం పలికారు. టేస్టీ తేజా, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌, అమర్‌ దీప్‌, సందీప్‌, ప్రియాంక, శోభా శెట్టి అందరూ వచ్చి రతికతో మాటలు కలిపారు. అలాగే కొత్త కంటెస్టెంట్లు కూడా తమకు తాము పరిచయం చేసుకున్నారు. అయితే హౌజ్‌లోకి వచ్చిన చాలా సేపటి వరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ రతికను పలకరించలేదు. అందరూ మాట్లాడుతున్నా దూరం నుంచి చూస్తూ జస్ట్‌ సైలెంట్‌గా ఉండిపోయాడు. చాలా సేపటి తర్వాత కిచెన్‌లో కూర్చున్నరతికా పాప కోసం రసగుల్లాను తీసుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ప్రేమగా ఆమె నోటికందించాడు. ‘ఏంటి రసగుల్లానా.. మల్లొచ్చినా’ అంటూ ప్రశాంత్ ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్ చెబుతూ సంతోషంగా స్వీట్‌ తినేసింది రతిక. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

కాగా బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ప్రారంభంలో రైతు బిడ్డతో ఎంతో చనువుగా మెలిగింది రతికా రోజ్‌. పాపం పల్లవి ప్రశాంత్‌ కూడా రతికతో బాగా క్లోజ్‌ అయిపోయాడు. ఒకరినొకరు గోరు ముద్దలు కూడా తినిపించుకున్నారు. అయితే ఉన్నట్లుండి కట్టప్పలా మారిపోయిన రతిక రైతు బిడ్డకు వెన్నుపోటు పొడిచింది. నామినేషన్స్‌లో ఓటు వేయడంతో చిన్న విషయాలకు కూడా అతనితో గొడవలకు దిగింది. అదే సమయంలో రైతు బిడ్డ ఎదురుగానే ప్రిన్స్‌ యావర్‌తో చనువుగా మెలగడం ప్రారంభించింది. అయితే అది కూడా ఎన్ని రోజులు సాగలేదు. ప్రిన్స్‌ను కూడా నామినేట్‌ చేసింది. ఇలా చిత్ర, విచిత్ర ప్రవర్తనతో నెగెటివిటీని మూటగట్టుకుంది రతిక. సోషల్‌ మీడియాలోనూ ట్రోలింగ్‌కు గురైంది. దీంతో నాలుగో వారంలో హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది. మరి మారిపోయానంటూ హౌజ్‌లోకి వచ్చిన రతికతో పల్లవి ప్రశాంత్‌ ఎలా ఉంటాడో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

 రతిక రీ ఎంట్రీ.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..