Jabardasth: డైరెక్టర్‌గా మారిన మరో జబర్దస్త్ కమెడియన్.. ధన్‌రాజ్ డెబ్యూ మూవీలో ఆ స్టార్ యాక్టర్
జబర్దస్త్ కంటెస్టెంట్, స్టార్ కమెడియన్ ధన్‌రాజ్ మెగా ఫోన్ పట్టుకున్నాడు. నటుడిగా, కమెడియన్‌గా 80కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన అతను ఇప్పుడు డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. బలగం వేణు ఇచ్చిన స్ఫూర్తితో ఓ ఎమోషనల్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ధన్ రాజ్ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నటుడు సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్ రాకెట్ రాఘవ, బలగం వేణు, నటుడు శివ బాలాజీ
జబర్దస్త్ కంటెస్టెంట్, స్టార్ కమెడియన్ ధన్‌రాజ్ మెగా ఫోన్ పట్టుకున్నాడు. నటుడిగా, కమెడియన్‌గా 80కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన అతను ఇప్పుడు డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. బలగం వేణు ఇచ్చిన స్ఫూర్తితో ఓ ఎమోషనల్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ధన్ రాజ్ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నటుడు సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్ రాకెట్ రాఘవ, బలగం వేణు, నటుడు శివ బాలాజీతో పాటు డైరెక్టర్లు రాజేంద్ర, భరత్ కమ్మ ఈ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేశారు. ధన రాజ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో స్టార్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని లీడ్ రోల్ పోషిస్తున్నారు. ధన్ రాజ్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హరీష్ ఉత్తమన్, మోక్ష, అజయ్ ఘోష్, పృథ్వీ తదితరులు వివిధ పాత్రల్లో మెరవనున్నారు. అనసూయ, సముద్రఖని నటించిన విమానం సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ, మాటలు సమకూర్చుతున్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. నవంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుందని, రెగ్యులర్ షూటింగ్ చేస్తామని ధన్‌రాజ్ తెలిపాడు. ‘దర్శకుడిగా నా మొదటి ప్రయాణం .. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, ఉంటాయని కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేశాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇస్తామన్నాడు.
కాగా రామ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ధన్ రాజ్. అందుల్లో అతను పోషించిన నాంపల్లి సంత్తి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నవ్వులు పూయించాడు. యువత, గోపి గోపిక గోదావరి, పిల్ల జమీందార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల.. ఇలా మొత్తం 80కు పైగా సినిమాల్లో నటించాడీ స్టార్ కెమడియన్. మధ్యలో జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి టీమ్ లీడర్‌గా సత్తా చాటాడు. ఇటీవల ‘బుజ్జీ ఇలారా’ సినిమాతో హీరోగానూ మెప్పించాడు. నిర్మాతగానూ కొన్ని సినిమాలు తెరకెక్కించాడు.
లీడ్ రోల్ లో సముద్రఖని..
View this post on Instagram
ధన్ రాజ్ డ్యాన్స్ చూశారా?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.