Guess The Actress: ఈ హీరోయిన్‌ ఎవరో కనిపెట్టారా? యూట్యూబర్‌ టు యాక్టర్‌.. స్టార్ నటి చెల్లెలు కూడా..

ఈ ఫొటోలో కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో కనిపిస్తోన్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? తెలుగు సినిమాలకు ఈ బ్యూటీ కొత్త కావచ్చు. కానీ హిందీ సినిమాలు, సాంగ్స్‌ చూసే వారికి ఈ అందాల తార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌ను ఏలుతో న్న ఓ స్టార్‌ హీరోయిన్‌ సోదరైన ఆమె ఓ యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత సింగర్‌గానూ సత్తా చాటింది. పలు ఆల్బమ్‌ సాంగ్స్‌, మ్యూజిక్‌ వీడియోలు చేసింది

Guess The Actress: ఈ హీరోయిన్‌ ఎవరో కనిపెట్టారా? యూట్యూబర్‌ టు యాక్టర్‌.. స్టార్ నటి చెల్లెలు కూడా..
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Oct 22, 2023 | 8:19 PM

ఈ ఫొటోలో కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో కనిపిస్తోన్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? తెలుగు సినిమాలకు ఈ బ్యూటీ కొత్త కావచ్చు. కానీ హిందీ సినిమాలు, సాంగ్స్‌ చూసే వారికి ఈ అందాల తార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌ను ఏలుతో న్న ఓ స్టార్‌ హీరోయిన్‌ సోదరైన ఆమె ఓ యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత సింగర్‌గానూ సత్తా చాటింది. పలు ఆల్బమ్‌ సాంగ్స్‌, మ్యూజిక్‌ వీడియోలు చేసింది. వీటికి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ రావడంతో బాగా క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక సినిమాల్లో ఆమె ఎంట్రీనే ఓ సెన్సేషన్‌. హిందీలో అక్షయ్‌ కుమార్‌ లాంటి స్టార్‌ హీరోలతో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో ఏకంగా మాస్‌ మహరాజా రవితేజ సినిమాతో అరంగేట్రం చేసింది. సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌. ఈ బ్యూటీ మరెవరో కాదు టైగర్‌ నాగేశ్వర రావు హీరోయిన్‌, అదేనండీ ఆదిపురుష్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ చెల్లెలు నుపుర్‌ సనన్‌. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని అందమైన ఫొటోలను నెట్టింట షేర్‌ చేసింది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పై ఫొటో కూడా అందులోదే.

రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వర రావు నుపుర్‌ సనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులో రవితేజ ప్రియురాలి సారా పాత్రలో నుపుర్‌ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. దసరా కానుకగా అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్‌ నాగేశ్వర రావు డీసెంట్‌ కలెక్షన్లతో దూసుకపోతోంది. వంశీ తెరకెక్కించినఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్‌, రేణు దేశాయ్‌ కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక నుపుర్‌ విషయానికొస్తే.. మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్పలో కూడా మెయిన్ రోల్‌కు ఎంపికైంది. అయితే కొన్ని కారణాలతో ఈ బ్యూటీ మంచు విష్ణు ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది భక్త కన్నప్ప టీమ్‌. ప్రస్తుతం నుపుర్‌ హిందీలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘నూరానీ చెహ్రా’ సినిమాలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

టైగర్ నాగేశ్వర రావు ప్రియురాలిగా..

View this post on Instagram

A post shared by Nupur Sanon (@nupursanon)

సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్..

View this post on Instagram

A post shared by Nupur Sanon (@nupursanon)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!