Guess The Actress: ప్రియాంకతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇటీవలే ముద్దుతో నెట్టింట బాగా ఫేమస్‌..

ప్రియాంకా చోప్రా.. సినిమా లవర్స్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా అంతర్జాతీయ సినిమాల్లోనూ అదరగొడుతోంది. రామ్‌ చరణ్‌ నటించిన తుఫాన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ అందాల తార. కాగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్‌ ఫొటోను షేర్‌ చేసింది. అందులో మిస్‌ వరల్డ్‌ కిరీటంతో ప్రియాంక మురిసిపోగా, ఆమెతో పాటు మరో క్యూట్‌ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది

Guess The Actress: ప్రియాంకతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇటీవలే ముద్దుతో నెట్టింట బాగా ఫేమస్‌..
Priyanka Chopra
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2023 | 11:14 AM

ప్రియాంకా చోప్రా.. సినిమా లవర్స్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా అంతర్జాతీయ సినిమాల్లోనూ అదరగొడుతోంది. రామ్‌ చరణ్‌ నటించిన తుఫాన్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ అందాల తార. కాగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్‌ ఫొటోను షేర్‌ చేసింది. అందులో మిస్‌ వరల్డ్‌ కిరీటంతో ప్రియాంక మురిసిపోగా, ఆమెతో పాటు మరో క్యూట్‌ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోకు ‘గుడ్ లక్‌ లిటిల్‌ వన్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది ప్రియాంక. మరి ఈ ఫొటోలో ప్రియాంకతో ఉన్నదెవరో గుర్తుపట్టారా? తెలుగులో ఈ హీరోయిన్‌ బాగా ఫేమస్‌. సునీల్‌, సాయి ధరమ్ తేజ్‌, ఇషాన్‌ వంటి యంగ్‌ హీరోలతో ఆడి పాడింది. అయితే ఎక్కువగా గ్లామరస్‌ హీరోయిన్‌గానే ఫోకస్‌ అయ్యింది. అయితే వీటన్నిటికంటే ఇటీవల ఓ సంఘటన ఆమెను బాగా వార్తల్లో నిలిచేలా చేసింది. ఓ సీనియర్‌ డైరెక్టర్‌ ఈ హీరోయిన్‌ను బహిరంగంగా ముద్దుపెట్టుకున్నాడు. ఇది సినిమా సర్కిల్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌.. ఈ అమ్మాయి మరెవరో కాదు ప్రియాంక చోప్రా కజిన్‌ సిస్టర్‌, హీరోయిన్‌ మన్నారా చోప్రా.

ప్రేమా గీమా జాన్తా నై సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మన్నారో చోప్రా. ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీ, తమిళం, పంజాబీ సినిమాల్లో నటించింది. సునీల్‌తో కలిసి జక్కన్న, సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి తిక్క సినిమాల్లో సందడి చేసింది. ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌- ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి కాంబినేషన్‌లో వస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఫంక్షన్‌లోనే డైరెక్టర్‌ మన్నారా బుగ్గపై ముద్దుపెట్టి వివాదానికి దారి తీశాడు. ఇక మన్నారా ఇటీవలే బిగ్‌ బాస్‌ హిందీ సీజన్‌ 17లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఈక్రమంలోనే ప్రియాంక చోప్రా తన సోదరికి సోషల్‌ మీడియాలో ఆల్‌ ది బెస్ట్ విషెస్‌ చెప్పింది. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరలైపోయింది.

ఇవి కూడా చదవండి

ప్రియాంకతో మన్నారా చోప్రా..

హిందీ బిగ్ బాస్ లో మన్నారా చోప్రా..

View this post on Instagram

A post shared by Mannara❤️ (@memannara)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!