Balagam Venu: రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందిన ‘బలగం’ వేణు.. మహాలక్ష్మి పుట్టిందంటూ..

బలగం సినిమాతో 2023ను మరుపురాని సంవత్సరంగా మార్చుకున్న బలగం వేణు ఇంట్లో మరోసారి ఆనందాలు వెల్లి విరిశాయి. అతని ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెట్టింది. అదేనండి.. వేణు రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతని భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాను రెండోసారి తండ్రైన విషయాన్ని వేణునే సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకున్నాడు.

Balagam Venu: రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందిన 'బలగం' వేణు.. మహాలక్ష్మి పుట్టిందంటూ..
Venu Yeldandi Family
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2023 | 6:36 PM

బలగం సినిమాతో డైరెక్టర్‌గా బ్లాక్‌ బస్టర్‌ ఎంట్రీ ఇచ్చాడు జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను ప్రతిబింబిస్తూ రూపొందిన మూవీ పలువురి ప్రశంసలు పొందింది. అంతర్జాతీయంగా అవార్డులు కూడా వచ్చాయి. బలగం సినిమాతో 2023ను మరుపురాని సంవత్సరంగా మార్చుకున్న బలగం వేణు ఇంట్లో మరోసారి ఆనందాలు వెల్లి విరిశాయి. అతని ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెట్టింది. అదేనండి.. వేణు రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతని భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాను రెండోసారి తండ్రైన విషయాన్ని వేణునే సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకున్నాడు. ‘మాకు అమ్మాయి పుట్టింది. ఈ శుభవార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని సోషల్‌ మీడియాలో తెలిపాడు. ఇందులో కూతురు ఫొటోను కూడా షేర్‌ చేశాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వేణు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా వేణు సతీమణి పేరు శ్రీలత. వీరిద్దరికి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇక కమెడియన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన వేణు సుమారు 200కు పైగా సినిమాల్లో నటించాడు. స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా స్పెషల్‌ రోల్స్‌ చేసి మెప్పించాడు. ఆ తర్వాత జబర్దస్త్‌ షోలోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి టీమ్‌ లీడర్‌ దాకా ఎదిగాడు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన వేణు మధ్యలో చాలా కాలం పాటు గ్యాప్‌ తీసుకున్నాడు. అయితే మెగా ఫోన్‌ పట్టుకుని బలగం సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చి 3న థియేటర్లలో రిలీజైన బలగం కలెక్షన్లతో పాటు ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయంగా ఏకంగా వందకు పైగా అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు వేణు. ఇది కూడా దిల్‌ రాజు బ్యానర్‌లోనే తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అప్‌డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆడబిడ్డ పుట్టింది..

భార్య, కుమారుడితో బలగం వేణు..

వేణు యెల్దండి ఫ్యామిలీ ఫొటోస్ ..

మరిన్నిసినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..