- Telugu News Photo Gallery Cinema photos Trisha Krishnan Next Movie with Hero thala ajith update details Telugu Actress Photos
Trisha Krishnan: ఈ బ్యూటీకి వయసే అవ్వదా అంటూ కామెంట్స్.! త్రిష ఫొటోస్.
సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు అమ్మడి కెరీర్ ముగిసినట్టే అని ఫిక్స్ అయిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ బ్యూటీ జోరు చూసి షాక్ అవుతున్నారు. వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న త్రిష గ్లామర్, గ్రేస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.
Updated on: Oct 21, 2023 | 5:51 PM

సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు అమ్మడి కెరీర్ ముగిసినట్టే అని ఫిక్స్ అయిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ బ్యూటీ జోరు చూసి షాక్ అవుతున్నారు.

వరుస హిట్స్‌తో జోరు చూపిస్తున్న త్రిష గ్లామర్, గ్రేస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గానీ త్రిష ఇమేజ్‌ను మాత్రం పూర్తిగా మార్చేసింది.

నిన్న మొన్నటి వరకు కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఫిక్స్ అయిన త్రిష.. ఈ సినిమా సక్సెస్ తరువాత మళ్లీ స్టార్ హీరోలకు జోడిగా మారారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో హుందాగా కనిపిస్తూనే గ్లామర్ యాంగిల్ కూడా చూపించారు త్రిష.

తెర మీద గ్రేస్‌ఫుల్‌గా కనిపించటమే కాదు... సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌లోనూ అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షింంచారు. దీంతో మరోసారి త్రిష టాక్ ఆఫ్ ది కోలీవుడ్‌గా మారారు.

పొన్నియిన్ సెల్వన్ వైబ్స్‌ను కంటిన్యూ చేస్తూ లియో ప్రమోషన్ విషయంలోనే అదే జోరు చూపిస్తున్నారు త్రిష. తెర మీద చీరకట్టులో హుందగా కనిపిస్తూ... త్రిష చూపించిన గ్రేస్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది.

దీంతో ఈ బ్యూటీకి వయసే అవ్వదా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఈ చెన్నై చంద్రం ఖాతాలో మరిన్ని క్రేజీ మూవీస్ యాడ్ అవుతున్నాయట.

తల అజిత్ నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా త్రిష పేరును పరిశీలిస్తున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్. ఈ మూవీ కూడా ఓకే అయితే సెకండ్ ఇన్సింగ్స్‌లోనూ స్టార్ హీరోలందరనీ కవర్ చేసిన హీరోయిన్‌గా నయా రికార్డ్ సెట్ చేస్తారు త్రిషా కృష్ణన్.




