Unstoppable With NBK: సొంత డబ్బుతో ఊరికి రోడ్డు వేయించిన అడవి బిడ్డ.. ఆర్థిక సహాయం చేసిన ‘భగవంత్‌ కేసరి’ నిర్మాత

నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌' సందడి మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ టాక్‌ షో మూడో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళవారం (అక్టోబర్‌ 17) సాయంత్రం ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకే మూడో సీజన్‌ మొదటి ఎసిపోడ్‌ స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వచ్చింది. భగవంత్‌ కేసరి టీమ్‌ నుంచి డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, అందాల తారలు కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల, విలన్‌ అర్జున్‌ రాంపాల్‌ మొదటి ఎపిసోడ్‌లో సందడి చేశారు.

Unstoppable With NBK: సొంత డబ్బుతో ఊరికి రోడ్డు వేయించిన అడవి బిడ్డ.. ఆర్థిక సహాయం చేసిన 'భగవంత్‌ కేసరి' నిర్మాత
Unstoppable With Nbk 3
Follow us
Basha Shek

|

Updated on: Oct 18, 2023 | 4:37 PM

నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ సందడి మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ టాక్‌ షో మూడో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళవారం (అక్టోబర్‌ 17) సాయంత్రం ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకే మూడో సీజన్‌ మొదటి ఎసిపోడ్‌ స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వచ్చింది. భగవంత్‌ కేసరి టీమ్‌ నుంచి డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, అందాల తారలు కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల, విలన్‌ అర్జున్‌ రాంపాల్‌ మొదటి ఎపిసోడ్‌లో సందడి చేశారు. ఎప్పటిలాగే ఈ టాక్‌ షో ఆద్యంతం సరదా సరదాగా సాగింద. అనిల్‌, కాజల్‌, శ్రీలీల ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌లోని ఆసక్తికర విషయాలను బాలయ్య రాబట్టారు. కాగా అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ చివరిలో సామాజిక సేవ చేస్తోన్న ఒక అమ్మాయిని ఘనంగా సత్కరించారు బాలయ్య. అంతేకాదు ఆమెకు ఆర్థిక సహాయం కూడా అందజేశారు. పుట్టిన ఊరు కోసం సొంతింటికి దాచుకున్న డబ్బును సైతం ఖర్చు పెట్టి రోడ్డు వేయించిన ఈ అడవి పులి అందరికీ ఆదర్శనీమయని బాలకృష్ణ కొనియాడారు. ‘ఆడపిల్ల అంటే జింక లెక్క కాదు.. పులి లెక్క ఉండాలే’ అని భగవంత్‌ కేసరి సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ బాగా జనాల్లోకి వెళ్లింది. అయితే అన్‌స్టాపబుల్‌ షోలో నిజమైన ఆడపులిని చూపిస్తానంటూ ఓ వీడియోను చూపించారు నందమూరి హీరో.

తోటగుట్టిపట్టు గిరిజన తాండాకు చెందిన జిమ్మీ నాలుగేళ్లుగా ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. నెలకు రూ. వేల జీతంలో ఊరి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తోంది. ‘ ఊరి ప్రజలకు దగ్గు, జ్వరం వస్తే మందులిస్తా. గర్భిణీలకు ఇబ్బందులొస్తే దవాఖానాకు తీసుకెళ్తా. అయితే ఇక్కడ రోడ్లు బాగోలేవు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగానే టీబీతో బాధపడుతున్న మా పిన్నీని ఆస్పత్రికి తీసుకెళ్లెలోపే చనిపోయింది. రోడ్లు సరిగా లేనందువల్ల ఊరిలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే కనీసం వాహనం కూడా లోపలికి రావడం లేదు.అందుకే సొంతంగా ఇల్లు కట్టు కోవడం కోసం దాచుకున్న డబ్బు మొత్తంతో ఊరిలో రోడ్లు వేయించాను. ఈ విషయంలో నా భర్త కూడా నాకు అండగా నిలిచారు’ అని తన గురించి చెప్పుకొచ్చింది జిమ్మీ. అనంతరం బాలయ్య మాట్లాడుతూ ‘ ప్రజల కోసం నువ్వు నిలబడిన వైనం.. నిన్ను అన్‌స్టాపబుల్‌ చేసింది’ అని అడవి బిడ్డపై ప్రశంసలు కురిపించారు. అనంతరం భగవంత్ కేసరి నిర్మాత సాహు గారపాటి ఆశా వర్కర్‌ చేస్తోన్న మంచి పనిని మెచ్చుకుంటూ రూ. 2 లక్షల చెక్‌ను బాలయ్య, కాజల్‌ చేతుల మీదుగా అందజేశారు. అలాగే స్పాన్సర్స్‌ నుంచి మరో రూ. 50 వేలు చెక్‌ను కూడా జిమ్మీకి అందజేశారు.

ఇవి కూడా చదవండి

అన్ స్టాపబుల్ లో భగవంత్ కేసరి టీమ్..

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..