Sapta Sagaralu Dhaati Side B: సూపర్‌ హిట్ లవ్‌ స్టోరీకి సీక్వెల్‌.. సప్త సాగరాలు దాటి సైడ్‌ బి రిలీజ్‌ ఎప్పుడంటే?

రక్షిత్ శెట్టి నటించిన ప్రేమకథా చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్‌ ఎ. రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌. హేమంత్‌ ఎం రావు తెరకెక్కించిన ఈ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఓటీటీలోనూ ఈ హృద్యమైన ప్రేమకథకు మంచి ఆదరణ దక్కింది. కాగా ఇప్పుడీ ప్రేమకథకు సీక్వెల్‌ వస్తోంది.

Sapta Sagaralu Dhaati Side B: సూపర్‌ హిట్ లవ్‌ స్టోరీకి సీక్వెల్‌.. సప్త సాగరాలు దాటి  సైడ్‌ బి రిలీజ్‌ ఎప్పుడంటే?
Sapta Sagaralu Dhaati Side B
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2023 | 7:12 PM

రక్షిత్ శెట్టి.. పేరుకు కన్నడ హీరో అయినప్పటికీ తెలుగులోనూ ఈ నటుడికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ముఖ్యంగా చార్లీ సినిమాతో చాలామందికి ఫేవరెట్‌ అయిపోయాడీ హీరో. కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, డైరెక్టర్‌గా కూడా సత్తా చాటుతున్నాడు రక్షిత్‌. ఈ నేపథ్యంలో  రక్షిత్ శెట్టి నటించిన ప్రేమకథా చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్‌ ఎ. రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌. హేమంత్‌ ఎం రావు తెరకెక్కించిన ఈ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఓటీటీలోనూ ఈ హృద్యమైన ప్రేమకథకు మంచి ఆదరణ దక్కింది. కాగా ఇప్పుడీ ప్రేమకథకు సీక్వెల్‌ వస్తోంది. ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ బి’ పేరుతో తెరకెక్కుతోన్న నవంబర్‌ 17న రిలీజ్ కానుంది. కాగా ‘సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఎ’ సినిమా మొదట కన్నడలో మాత్రమే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. తర్వాత ఈ సినిమా OTTకి వెళ్లి 5 భాషల్లో వీక్షించడానికి అందుబాటులోకి వచ్చింది. అయితే సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

మను జైలు నుంచి బయటకు వచ్చాడా? ప్రేమ ఫలించిందా?

కాగా సీక్వెల్‌ కు కూడా హేమంత్ రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ రాజ్ స్వరపరిచిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ తో పాటు అచ్యుత్ కుమార్, అవినాష్ తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా మొదటి పార్ట్‌ లో మ‌ను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వ‌సంత్‌) ఓ ప్రేమ‌జంట‌. అయితే కొన్ని కారణాలతో మను ఏ తప్పు చేయకున్నా జైలుకు వెళతాడు. దీంతో ఇద్దరూ విడిపోతారు. మరి తన తప్పులేకుండా జైలుకెళ్లిన కథానాయకుడు పగ తీర్చుకుంటాడా? విడిపోయిన ప్రియురాలు ప్రియ మళ్లీ అతడికి దొరికిందా? లేదా అన్నది తెలుసుకోవాలంటే సప్త సాగరదాచే ఎల్లో సైడ్ బి చూడాల్సిందే అంటున్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

నవంబర్ 7న గ్రాండ్ రిలీజ్..

సప్త సాగరాలు దాటి- సైడ్ ఏ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..