Chandramukhi 2 OTT: ఇట్స్‌ అఫిషియల్‌.. ఈనెలలోనే ఓటీటీలోకి చంద్రముఖి 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్‌ సినిమా చంద్రముఖి 2. గతంలో రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా చంద్రముఖికి ఇది సీక్వెల్‌. మొదటి భాగాన్ని తెరకెక్కించిన పి. వాసునే చంద్రముఖి 2ను రూపొందించారు. భారీ అంచనాలతో సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ హార్రర్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది

Chandramukhi 2 OTT: ఇట్స్‌ అఫిషియల్‌.. ఈనెలలోనే ఓటీటీలోకి చంద్రముఖి 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Chandramukhi 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2023 | 3:27 PM

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్‌ సినిమా చంద్రముఖి 2. గతంలో రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా చంద్రముఖికి ఇది సీక్వెల్‌. మొదటి భాగాన్ని తెరకెక్కించిన పి. వాసునే చంద్రముఖి 2ను రూపొందించారు. భారీ అంచనాలతో సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ హార్రర్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లారెన్స్‌, కంగనాల నటనపై ప్రశంసలు వచ్చినా పాత చంద్రముఖినే తిరిగి మళ్లీ చూపించారంటూ కామెంట్స్‌ వినిపించాయి. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాకు మోస్తరు వసూళ్లు మాత్రమే దక్కాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని చంద్రముఖి 2 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లారెన్స్‌, కంగనాల సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ  ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 26న చంద్రముఖి 2 సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో చంద్రముఖి 2 మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

కాగా చంద్రముఖి 2 ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సుమారు దాదాపు రూ. 8 కోట్లు వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది.  చంద్రముఖి 2 సినిమాలో లక్ష్మీ మేనన్‌, వడివేలు, రాధికా శరత్ కుమార్‌, మహిమా నంబియార్‌, రావు రమేశ్‌, శత్రు, అయ్యప్ప శర్మ, ఆర్‌ ఎస్‌ శివాజీ, వైజీ మహేంద్రన్‌, మనోబాల, సుభీక్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఎమ్‌. ఎమ్‌. కీరవాణి స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో చంద్రముఖి 2 సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి మరి.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ..

చంద్రముఖి 2 సినిమా ట్రైలర్..

చంద్రముఖి గా కంగనా అభినయం అదుర్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!