Bigg Boss 7 Telugu: ‘నేనూ ఒక ఆడపిల్లనే.. ఎందుకు మమ్మల్ని బూతులు తిడుతున్నారు’.. అమర్‌ దీప్‌ భార్య తేజస్విని

బిగ్గెస్ట్‌ టీవీ రియాలిటీ షో అయిన బిగ్‌ బాస్‌లో అత్యంత నెగెటివిటీని మూట గట్టుకుంటోన్న కంటెస్టెంట్‌ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అమర్‌ దీప్‌ చౌదరి. సీజన్‌ ప్రారంభంలో పల్లవి ప్రశాంత్‌, శివాజీలతో గొడవలు పెట్టుకున్న అమర్‌ అనవసరంగా కొంత మందికి అనవరసంగా టార్గెట్‌గా మారిపోయాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌ అభిమానులు అమర్‌ను బాగా టార్గెట్‌గా చేసుకున్నారు. ఆ తర్వాత టాస్కుల్లోనూ పెద్దగా ట్యాలెంట్ చూపించకపోవడంతో హోస్ట్‌ నాగార్జున సైతం అమర్‌ను గట్టిగా వాయించేశాడు

Bigg Boss 7 Telugu: 'నేనూ ఒక ఆడపిల్లనే.. ఎందుకు మమ్మల్ని బూతులు తిడుతున్నారు'.. అమర్‌ దీప్‌ భార్య తేజస్విని
Amardeep Family
Follow us
Basha Shek

|

Updated on: Oct 21, 2023 | 4:47 PM

బిగ్గెస్ట్‌ టీవీ రియాలిటీ షో అయిన బిగ్‌ బాస్‌లో అత్యంత నెగెటివిటీని మూట గట్టుకుంటోన్న కంటెస్టెంట్‌ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అమర్‌ దీప్‌ చౌదరి. సీజన్‌ ప్రారంభంలో పల్లవి ప్రశాంత్‌, శివాజీలతో గొడవలు పెట్టుకున్న అమర్‌ అనవసరంగా కొంత మందికి అనవరసంగా టార్గెట్‌గా మారిపోయాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌ అభిమానులు అమర్‌ను బాగా టార్గెట్‌గా చేసుకున్నారు. ఆ తర్వాత టాస్కుల్లోనూ పెద్దగా ట్యాలెంట్ చూపించకపోవడంతో హోస్ట్‌ నాగార్జున సైతం అమర్‌ను గట్టిగా వాయించేశాడు. ప్రతివారం నాగ్‌ చేతిలో ఈ సీరియల్ బ్యాచ్‌ లీడర్‌కి కోటింగ్‌ ఉంటోంది. అదే సమయంలో హౌజ్‌ బయట కూడా అమర్‌పై భారీ ట్రోలింగ్‌ జరుగుతోంది. కొందరైతే అమర్‌ను అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దూషిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే హౌజ్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా నిలబడుతున్నాడు అమర్‌. ఇదిలా ఉంటే అమర్‌ దీప్‌ ఎదుర్కొంటోన్న నెగెటివిటీపై అతని భార్య తేజస్విని గౌడ స్పందించింది. తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె తన భర్తపై వస్తోన్న ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించింది.

ఇవి కూడా చదవండి

‘బిగ్‌ బాస్‌లో అమర్‌ దీప్‌ చాలా ఇబ్బంది పడ్డాడు. కొందరు కంటెస్టెంట్ల పెయిడ్‌ పీ ఆర్‌ బ్యాచ్‌ అతనిని బాగా వేధిస్తున్నారు. బూతులు తిడుతున్నారు. అయితే ఆర్టిస్టుగా నాకు కూడా పని ఉంటుంది. నా వర్క్‌తో పాటు అమర్‌ దీప్‌ విషయాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ నేను స్పందించినా పెయిడ్‌ పీఆర్‌ టీమ్‌ బూతులు తిడుతూనే ఉంటారు. అందుకే నేను ఇన్ని రోజులు ఈ విషయంపై స్పందించలేదు. ఇకపై అమర్‌ గురించి స్టాండ్‌ తీసుకుంటా. ఇది చెప్పిన తర్వాత కూడా నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తే నేను ఏం చేయలేను. ఎందుకంటే నేను కూడా ఒక ఆడపిల్లనే. మీఇంట్లోని ఆడపిల్లలను ఇలాగే తిడితే ఎలా ఉంటుంది. బిగ్‌ బాస్‌ అనేది కేవలం మూడు నెలల గేమ్‌ షో. ఒక్కోసారి కొట్టుకుంటారు. మరొకసారి కలిసి పోతారు. అంత మాత్రాన మీరు వారి కుటుంబ సభ్యులు, మహిళలను తిట్టడం ఏంటి? ఇలాంటి నెగెటివ్‌ కామెంట్లు చేసేటప్పుడు మీ ఇంటి ఆడవారిని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి’ అని తేజస్విని ఎమోషనల్‌ అయ్యింది.

అమర్ దీప్ తో తేజస్విని..

యాంకర్ రవితో తేజస్విని..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..