Prabhas Birthday: ప్రభాస్‌ బర్త్​డే సెలబ్రేషన్స్ షూరూ.. దేశంలోనే అతిపెద్ద కటౌట్​ హైదరాబాద్‌లో.. వీడియో చూశారా?

జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు షురూ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే గట్టిగానే ప్లాన్స్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా కూకట్‌ పల్లి ఏరియాలో ప్రభాస్‌ భారీ కటౌట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్​గా నిర్మాణం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కటౌట్‌కు సంబంధించిన పనులు పూర్తికావొచ్చినట్లు తెలుస్తోంది.

Prabhas Birthday: ప్రభాస్‌ బర్త్​డే సెలబ్రేషన్స్ షూరూ.. దేశంలోనే అతిపెద్ద కటౌట్​ హైదరాబాద్‌లో.. వీడియో చూశారా?
Prabhas Birthday
Follow us
Basha Shek

|

Updated on: Oct 22, 2023 | 9:52 PM

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ సోమవారం (అక్టోబర్‌ 23) పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో డార్గింగ్‌ అభిమానులు ప్రభాస్ బర్త్​డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు షురూ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే గట్టిగానే ప్లాన్స్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా కూకట్‌ పల్లి ఏరియాలో ప్రభాస్‌ భారీ కటౌట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్​గా నిర్మాణం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కటౌట్‌కు సంబంధించిన పనులు పూర్తికావొచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం నాటికి కటౌట్ పనులు పూర్తి చేసి ఆవిష్కరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. ఉదయం 11 గంటలకు డార్లింగ్‌ కటౌట్ ఆవిష్కరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్‌ కటౌట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్​వుతున్నాయి.

కాగా బాహుబలి సిరీస్‌ సినిమాలతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయారు ప్రభాస్‌. ఆతర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ సినిమాలు పెద్దగా ఆడనప్పటికీ ఆయన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్‌, కల్కి వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ప్రభాస్‌ నటిస్తున్నాడు. కాగా ప్రభాస్ నటించిన సాలార్ చిత్రం డిసెంబర్ 22న విడుదలవుతోంది. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని అభిమానుల కోరిక. అయితే చిత్రబృందం నుండి అలాంటి సమాచారం ఏదీ లేదు. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇంత త్వరగా ట్రైలర్ విడుదల చేస్తే సినిమాకు పెద్దగా లాభం ఉండదంటున్నారు మేకర్స్‌. ఇక కల్కి2898 ఏడీ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ రావొచ్చని తెలుస్తోంది. కాగా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమాలో ప్రభాస్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఏమైనా అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఎలాంటి సర్ ప్రైజ్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

కూకట్ పల్లిలో భారీ కటౌట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!