- Telugu News Photo Gallery Cinema photos Rebel Star Prabhas Marriage AI Photos Goes Trending in Social Media Telugu Entertainment Photos
Prabhas: బ్యాచ్‌లర్‌గా ప్రభాస్ జరుపుకొనే ఆఖరి బర్త్ డే ఇదేనా.? ముహూర్తం ఫిక్స్ అయ్యినట్టేనా.?
ప్రతి రోజూ ఏదో ఒక విషయంతో ట్రెండింగ్‌లో ఉంటారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సర్జరీ తర్వాత ఫారిన్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు ప్రభాస్. ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు ఎక్కడ జరుపుకుంటారనే విషయం మీద కూడా ఇంకా క్లారిటీ లేదు. ఫారిన్‌లోనే బర్త్ డే వేడుకలు జరుపుకుంటారని కొందరి గెస్. మరికొందరి ప్రకారం, పుట్టినరోజు నాటికి ప్రభాస్ ఇండియాకి వచ్చేస్తారట. ఈ బర్త్ డేకి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది మరి అని అంటున్నారు కాస్త సన్నిహితులు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Ravi Kiran
Updated on: Oct 23, 2023 | 8:00 AM

ప్రతి రోజూ ఏదో ఒక విషయంతో ట్రెండింగ్‌లో ఉంటారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సర్జరీ తర్వాత ఫారిన్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు ప్రభాస్. ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు ఎక్కడ జరుపుకుంటారనే విషయం మీద కూడా ఇంకా క్లారిటీ లేదు.

ఫారిన్‌లోనే బర్త్ డే వేడుకలు జరుపుకుంటారని కొందరి గెస్. మరికొందరి ప్రకారం, పుట్టినరోజు నాటికి ప్రభాస్ ఇండియాకి వచ్చేస్తారట. ఈ బర్త్ డేకి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది మరి అని అంటున్నారు కాస్త సన్నిహితులు.

2023లో ప్రభాస్ జరుపుకోబోయే బర్త్ డే గురించి సరికొత్త న్యూస్ ఒకటి ట్రెండ్ అవుతోంది. బ్యాచ్‌లర్‌గా ప్రభాస్ జరుపుకునే ఆఖరి పుట్టినరోజు ఇదేనా అంటూ ఇంట్రస్టింగ్ డిస్కషన్ మొదలయింది.

రెబల్ సైన్యంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు. ఆయన సతీమణి శ్యామలాదేవి ఇటీవల అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. రెబల్ ఫ్యాన్స్ అందరూ హాయిగా ఉండాలని కోరుకున్నానని అన్నారు.

అంతే కాదు, ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని చెప్పారు. పెళ్లికి అందరినీ తప్పకుండా పిలుస్తామని కూడా అన్నారు. తాను తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని ఇదివరకు ఓ సారి ప్రభాస్ కూడా చెప్పారు.

వీటన్నిటినీ బట్టి, సలార్ తర్వాత ప్రభాస్ పెళ్లికొడుకు అవుతారా? ఆల్రెడీ అమ్మాయి ఫిక్సయిందా? వంటి విషయాల మీద అనుమానాలు మొదలయ్యాయి జనాల్లో ఇటీవల ప్రభాస్‌కి పెళ్లయి, ఓ పాప పుడితే ఎలా ఉంటుందో ఏఐలో చేసి, చూసి మురిసిపోయారు ఫ్యాన్స్.

ప్రభాస్ - అనుష్క మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ ఎన్నో ఏళ్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. వాటినే ఆధారంగా చేసుకుని ఏఐ పిక్స్ చేసి వైరల్ చేశారు. వాళ్లిద్దరికీ నిజంగా పెళ్లయితే ఎంత బావుంటుంది అంటూ ఆ మధ్య నెట్టింట్లో డిస్కషన్ కూడా షురూ అయింది. ప్రభాస్ ఇండియాలో అడుగుపెట్టి, పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేవరకు ఇలాంటి వార్తలు మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటాయి.





























