Renu desai: పవన్ కళ్యాణ్ సీఎం పదవి గురించి మనసులో మాట చెప్పిన రేణు దేశాయ్..

తాను చాలా ఏళ్ల నుంచి యోగా చేస్తున్నానని మంచి లైఫ్ స్టైల్ ఉండడంతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాని పేర్కొన్నారు. మా నాన్నమ్మ 45 ఏళ్లకు మరణిస్తే.. మా నాన్న గారు 60 ఏళ్లకు ముందే మరణించారు. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు.. అంటూనే నాకు జెనెటిక్స్ వల్ల ఇబ్బంది ఉన్నా.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని తెలిపారు. అంతేకాదు తనకు విలన్ క్యారెక్టర్ చెయ్యాలని ఉందని కోరికను వెల్లడించారు రేణు దేశాయ్..

Renu desai: పవన్ కళ్యాణ్ సీఎం పదవి గురించి మనసులో మాట చెప్పిన రేణు దేశాయ్..
Renu Desai Akira
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2023 | 9:22 PM

రేణు దేశాయ్ ను పవన్ ఫ్యాన్స్ వదినమ్మగానే చూస్తారు. గౌరవిస్తారు కూడా.. అయితే గత కొంతకాలం క్రితం.. పవన్ కళ్యాణ్ రాజకీయ నేపధ్యం గురించి రేణు దేశాయ్ స్పందిస్తూ.. సమాజానికి ఏదో మంచి చెయ్యాలని తపిస్తారు.. ఆ విషయంలో చాలా మంచి వ్యక్తి అని చెప్పారు.. అయితే తాజాగా టీవీ 9 మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు దేశాయ్ ను పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగితే వెంటనే ఆ క్వశ్చన్ మాత్రం వద్దు అంటూ పవన్ సీఎం అవుతారా లేదా అనేది నాకు అనవసరం.. అసలు నేను ఏమీ కోరుకోను ఆ విషయం ఒక్క దేవుడికి మాత్రమే తెలుసు ఎవరికీ ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు అంటూ దేవుడి మీద పవన్ ను సీఎం అయ్యే భారాన్ని వేసేశారు రేణు.  నేను ఏ స్టాండ్ తీసుకోను.. ఉన్న విషయాన్నీ చెప్పాను.. నేను ఎవరికీ క్యాంపెయిన్ కూడా చెయ్యను అని స్పష్టం చేశారు.

మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటే.. ఇది జెనెటిక్స్ ద్వారా వచ్చింది.. దీనికి క్యూర్ లేదు.. లైఫ్ లాంగ్ ఈ కండిషన్ లో జీవించాల్సిందే.. తాను చాలా ఏళ్ల నుంచి యోగా చేస్తున్నానని మంచి లైఫ్ స్టైల్ ఉండడంతో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాని పేర్కొన్నారు. మా నాన్నమ్మ 45 ఏళ్లకు మరణిస్తే.. మా నాన్న గారు 60 ఏళ్లకు ముందే మరణించారు. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు.. అంటూనే నాకు జెనెటిక్స్ వల్ల ఇబ్బంది ఉన్నా.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని తెలిపారు. అంతేకాదు తనకు విలన్ క్యారెక్టర్ చెయ్యాలని ఉందని కోరికను వెల్లడించారు రేణు దేశాయ్..

ఇవి కూడా చదవండి

అకిరా నందన్ ను హీరోగా చేస్తారా అన్న ప్రశ్నకు రేణు దేశాయ్ చెబుతూ.. తనకు ఏది ఇష్టమైతే అది చేస్తాను.. అయితే తనకు నటన అంటే అంత ఇష్టం లేదని స్పష్టం చేశారు. నేను యాక్టర్ .. నేను డైరెక్టర్.. తనకు తన కొడుకు స్క్రీన్ మీద కన్పిస్తాడు అంటే తనకు చాలా సంతోషం అని .. ఎప్పుడు కనిపించినా హ్యాపీ పీల్ అవుతానని స్పష్టం చేసింది రేణు దేశాయ్.. మీరు ఎంత ఫ్యాన్ అయినా నేను కని పెంచుకున్న కొడుకు అకిరా హీరో అయ్యి వెండి తెరపై కనిపిస్తాడంటే సంతోషం నాకు ఉండదా అంటూ ప్రశ్నించింది.

ఒక షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతూ.. అకీరాకు మంచి సంగీత అభిరుచి ఉందని ఆ షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ అకిరా అందిస్తే.. త్రివిక్రమ్ తనయుడు నటించాడని.. కార్తికేయ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ చేశాడని సంతోషంగా అకిరా అభిరుచి గురించి పంచుకుంది రేణు దేశాయ్.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే