Anasuya: మీకు మేమే దొరికామా? మమ్మల్ని ఎందుకు లాగుతారు? నెటిజన్ కు అనసూయ క్లాస్

అతి కష్టం మీద పవన్ కళ్యాణ్ ఒకొక్క అడుగు వేసే విధంగా చూసేలా సెక్యూరిటీ గార్డ్స్ కష్టపడుతున్న సమయంలో అక్కడ అనుకోని విధంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా చిక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. అనసూయ, రష్మీ వచ్చినా జనం ఇలాగే ఎగబడతారు అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ అనసూయ దృష్టికి చేరుకుంది. 

Anasuya: మీకు మేమే దొరికామా? మమ్మల్ని ఎందుకు లాగుతారు? నెటిజన్ కు అనసూయ క్లాస్
Anasuya Bharadwaj
Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2023 | 6:38 PM

సెలబ్రెటీ కనిపిస్తే చాలు అభిమానులు మాత్రమే కాదు జనం ఎగబడతారు. వారు స్టార్ హీరో హీరోయిన్లా, చిన్న నటీనటులా అని చూడరు వారిని చూడడం కోసం ఆత్రుతని కనబరుస్తారు.. మరి అలాంటిది పవర్ స్థార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తే.. అక్కడ ఉండే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే పవన్ కళ్యాణ్ ను చూడడానికి ఎగబడిన జనాన్ని చూసి.. ఒక నెటిజన్ అనసూయ తో పోలుస్తూ చులకనగా చేసిన కామెంట్ పై అనసూయ స్పందించింది. తనను ప్రస్తావిస్తూ చులకనగా మాట్లాడిన నెటిజన్ పై అసహనం వ్యక్తం చేసింది అనసూయ. తాను చాలా కష్టపడి ఈ స్టేజ్ కు చేరుకున్నానని.. కనుక తనను గౌరవించమని ఓ రేంజ్ లో క్లాస్ పీకింది.. వివరాల్లోకి వెళ్తే..

ఆదివారం రాత్రి దివంగ నేత వంగవీటి రంగా తనయుడు రాధా పుష్పవల్లి పెళ్లి కృష్ణా జిల్లా పోరంకిలో జరిగింది. ఈ వివాహ వేడుక్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సమయంలో అక్కడ ఒక్కసారిగా సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఫోటోలు తీసుకునేందుకు వివాహ వేడుకలో ఉన్న అతిధులు ఒక్కసారిగా పోటీపడ్డారు. ఒక్కసారిగా పెళ్లి వేడుక వద్ద గందరగోళం నెలకొంది. తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే అంతమంది జనం మధ్య పవన్ కళ్యాణ్ ముందుకు కదిలేందుకు సేఫ్ గా బయటకు వచ్చెనందుకు సెక్యూరిటీ గార్డ్స్ చాలా కష్టపడ్డారు. అతి కష్టం మీద పవన్ కళ్యాణ్ ఒకొక్క అడుగు వేసే విధంగా చూసేలా సెక్యూరిటీ గార్డ్స్ కష్టపడుతున్న సమయంలో అక్కడ అనుకోని విధంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా చిక్కుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. అనసూయ, రష్మీ వచ్చినా జనం ఇలాగే ఎగబడతారు అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్ అనసూయ దృష్టికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

తమకు సంబంధం లేని విషయంలో అందునా తక్కువ చేస్తూ.. అగౌరవంగా మాట్లాడం తప్పు అంటూ అనసూయ కామెంట్ చేసింది. అవును మేము కనిపిస్తే జనం చూడడానికి ఆసక్తిని చూపిస్తారు. ఎందుకంటే జీవితంలో ఎదో సాధించిన వారు.. నిత్యం తెరపై కనిపించేవారు డైరెక్ట్ గా ఎలా ఉంటారో చూద్దామని ఆసక్తిని చూపిస్తారు. మేము ఈ స్టేజ్ కు చేరుకుంది.. మా పేర్లు వాడినంత ఈజీ కాదు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ స్టేజ్ కు చేరుకున్నాం.. దయచేసి మా జర్నీని గౌరవించండి అంటూ అనసూయ ఆ నెటిజన్ చేసిన కామెంట్ కు ఓ రేంజ్ లో క్లాస్ పీకింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే