- Telugu News Photo Gallery Cinema photos Raj and DK are getting ready for Hollywood entry Telugu Entertainment Photos
Raj N DK: హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న రాజ్ అండ్ డీకే..! అక్కడ కూడా ఇదే ట్రెండ్.
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. 2003లో దర్శకులుగా ఎంట్రీ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇన్నేళ్ల కెరీర్‌లో కేవలం ఏడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. మరో నాలుగైదు సినిమాలకు ఇతర డిపార్ట్‌మెంట్స్‌లో వర్క్ చేయటంతో పాటు ఓటీటీలోనూ తమ మార్క్ చూపించారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు రాజ్ అండ్ డీకే.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Oct 23, 2023 | 6:59 PM

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. 2003లో దర్శకులుగా ఎంట్రీ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇన్నేళ్ల కెరీర్‌లో కేవలం ఏడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు.

మరో నాలుగైదు సినిమాలకు ఇతర డిపార్ట్‌మెంట్స్‌లో వర్క్ చేయటంతో పాటు ఓటీటీలోనూ తమ మార్క్ చూపించారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు రాజ్ అండ్ డీకే.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో నేషనల్ లెవల్‌లో పాపురల్ అయిన రాజ్ అండ్ డీకే ఇప్పుడు తమ స్పాన్‌ను మరింత పెంచుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఆల్రెడీ టాలీవుడ్, బాలీవుడ్‌లో బిగ్ హిట్స్ ఇచ్చిన రాజ్ అండ్ డీకే త్వరలో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది.

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్‌తో పాటు ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ సిరీస్‌లకు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో ఈ దర్శక ద్వయం పేరు హాలీవుడ్ వరకు రీసౌండ్ చేసింది.

ఓ వరల్డ్ ఫేమస్ వెబ్ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే కథ సిద్ధం చేస్తున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ ఉన్న సూపర్ హీరో సినిమాలను అందిస్తున్న హాలీవుడ్ సంస్థ మార్వెల్స్.

ఇప్పుడు ఈ బ్యానర్ కోసం ఓ సూపర్ హీరో కథను సిద్ధం చేస్తున్నారు రాజ్ అండ్ డీకే. ప్రజెంట్ సెట్స్ మీదున్న సిటాడెల్‌తో పాటు మార్వెల్స్ కథను వర్క్ చేస్తున్నారు రాజ్ అండ్ డీకే.





























