AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నవరాత్రి ఛాలెంజ్‌ని స్వీకరించిన జపనీస్ అమ్మాయి.. గర్భా, దాండియా వీడియోలతో సందడి

మాయో తన డ్యాన్స్ తో పండుగను ఆస్వాదిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే మాయో భారతీయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ లెహంగా ధరించి గర్భా సాంప్రదాయ నృత్య కదలికలను అనుసరిస్తూ మనోహరంగా డాన్స్ చేసింది. నవరాత్రుల్లో భాగంగా  రోజు రంగును దుస్తులను ధరించి డ్యాన్స్ చేస్తోంది.   

Viral Video: నవరాత్రి ఛాలెంజ్‌ని స్వీకరించిన జపనీస్ అమ్మాయి.. గర్భా, దాండియా వీడియోలతో సందడి
Japanese Girl Garba
Surya Kala
|

Updated on: Oct 23, 2023 | 8:24 PM

Share

నవరాత్రి తొమ్మిది రోజులు సందడే సందడి. గర్భ డ్యాన్స్, దాండియా, బతుకమ్మ, వాహన ఉరేగింపు వంటి సంబరాలు ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో నివసిస్తున్న మాయో అనే జపాన్ మహిళ సోషల్ మీడియాలో నవరాత్రి ఛాలెంజ్‌ను స్వీకరించింది. మాయో తన గర్బా , దాండియాలో ఉన్న ప్రతిభను చూపిస్తూ ఆ వీడియోలను అప్‌లోడ్ చేస్తుంది. మాయో తన డ్యాన్స్ తో పండుగను ఆస్వాదిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే మాయో భారతీయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ లెహంగా ధరించి గర్భా సాంప్రదాయ నృత్య కదలికలను అనుసరిస్తూ మనోహరంగా డాన్స్ చేసింది. నవరాత్రుల్లో భాగంగా  రోజు రంగును దుస్తులను ధరించి డ్యాన్స్ చేస్తోంది.

మొదటి రోజున మయో..  రినా అనే మరో ఇన్‌ఫ్లుయెన్సర్‌తో డ్యాన్స్ స్టేజ్‌ను పంచుకుంది. బాలీవుడ్ చిత్రం గంగూబాయి కతియావాడిలోని ప్రముఖ పాట ‘ఝుమే రే గోరీ’కి  ఈ ద్వయం గర్బా స్టెప్పులు వేశారు. పండుగ రెండవ రోజు మాయో గంగూబాయి వైట్ చీరలో సోలో ప్రదర్శనను చేసింది. తర్వాత జపాన్ అమ్మాయి ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తులు ధరించి ‘నగడ సాంగ్ ధోల్’ పాటకు డ్యాన్స్ చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Mayo Japan (@mayojapan)

ఏడవ రోజు వరకు మాయో నవరాత్రి గర్భా డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసింది.  అయితే  7వ రోజు తన డ్యాన్స్  వీడియోను షేర్ చేయలేదు. తర్వాతి రోజున ఆమె పర్పుల్, పీకాక్ గ్రీన్ డే సందర్భంగా  గర్బా డ్యాన్స్ చేస్తూ రీల్‌ను పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Mayo Japan (@mayojapan)

ఫన్ ఛాలెంజ్‌లో కొంచెం మోసం చేయడంతో, “దాదాపు పూర్తి చేశాను” అని క్యాప్షన్ ఇచ్చింది. చివరి రోజున  ఆమె తన గార్బా వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది: “కాబట్టి నేను దాదాపు 9 రంగుల నవరాత్రి ఛాలెంజ్‌ని పూర్తి చేసాను. అయితే తనకు గ్రే కలర్ కాస్ట్యూమ్ లేదని అందుకనే వేరొకరి నుండి తెచ్చుకునే సమయం లేకపోవడంతో గ్రే కలర్ డ్రెస్ మిస్ అయ్యానని చెప్పింది. అయితే దీనికి బదులుగా తాను జపాన్‌లో జరిగిన నవరాత్రి ఈవెంట్ ఫుటేజీని అతి త్వరలో పోస్ట్ చేస్తానని పేర్కొంది మాయో..

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..