Airplane Village: ఆ ఊరిలో ప్రతి ఇంటికి ఒక విమానం.. కూరగాయలు తీసుకొచ్చేందుకు కూడా..

నాలుగు ఇళ్లకు ఓ కారు ఉండటం సహజంగా మారింది. అయితే మనకు విమానంలో ప్రయాణించడం ఓ కల.. దాని కోసం చాలా కాలం ఎదురు చూస్తాం.. తక్కువ ధరలో టికెట్ దొరికితే ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటాం. విమానంలో కూర్చోవాలని.. కాసేపు ఎగిరిపోవాలని మనలో చాలా మందికి ఉంటుంది.. కానీ రకరకాల కారణంగా ఆ కల కలగానే ఉండిపోతోంది. అయితే, ఆ గ్రామంలో మాత్రం ప్రతి ఇంటికి ఓ విమానం ఉండటం సహజం.

Airplane Village: ఆ ఊరిలో ప్రతి ఇంటికి ఒక విమానం.. కూరగాయలు తీసుకొచ్చేందుకు కూడా..
Airoplane Village
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 23, 2023 | 7:57 PM

ఈ మధ్యకాలం ప్రతి ఇంటికి ఓ టూ వీలర్,.. నాలుగు ఇళ్లకు ఓ కారు ఉండటం సహజంగా మారింది. అయితే మనకు విమానంలో ప్రయాణించడం ఓ కల.. దాని కోసం చాలా కాలం ఎదురు చూస్తాం.. తక్కువ ధరలో టికెట్ దొరికితే ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటాం. విమానంలో కూర్చోవాలని.. కాసేపు ఎగిరిపోవాలని మనలో చాలా మందికి ఉంటుంది.. కానీ రకరకాల కారణంగా ఆ కల కలగానే ఉండిపోతోంది.

అయితే, ఆ గ్రామంలో మాత్రం ప్రతి ఇంటికి ఓ విమానం ఉండటం సహజం. విమానం ఉందిగా అని అలా పక్కన పెట్టి జాగ్రత్తగా చూసుకోవడం కాదు.. ఇంట్లోని సరుకులు తీసుకొచ్చేందుకు మార్కెట్‌కు  కూడా విమానంలోనే ప్రయాణిస్తారు. ఇవాళ ఆ గ్రామం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం..

ఈ గ్రామం ఎక్కడ ఉందంటే..

మనం చెబుతున్న గ్రామం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. వాస్తవానికి, కామెరాన్ ఎయిర్ పార్క్ అనే గ్రామం ఉంది. ఇక్కడ ప్రజలు తమ ఇళ్ల వెలుపల కారును పార్కింగ్ చేయరు.  విమానాలు మాత్రం పార్కింగ్ చేస్తారు. అతిపెద్ద విషయం ఏంటంటే.. ఈ విమానాలు చాలా ఖరీదైనవి.. మీరు వాటి ధరను కూడా ఊహించలేరు. ఈ గ్రామంలోని చాలా మందికి విమానాలు నడపడం తెలుసు. వారు తమ గ్రామం నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఆ విమానాలను మాత్రమే ఉపయోగిస్తారు. వారి ఇంట్లోని ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ వచ్చి ఉంటుంది.

ఈ గ్రామ ప్రత్యేకత ఇదే..

ఈ గ్రామంలో చాలా విమానాలు ఉన్నందున..  ఈ గ్రామాన్ని చాలా ప్రత్యేకమైన రీతిలో డిజైన్ చేశారు. ఈ రోడ్లపై విమానాన్ని సులువుగా ల్యాండ్ చేయడంతోపాటు విమానాన్ని కూడా నడపగలిగే విధంగా ఇక్కడ రోడ్లు తయారు చేశారు. దీంతో పాటు విమానం భద్రత, మరమ్మతుల కోసం ఇక్కడి వారికి తెలిసి ఉంటాయి. ఈ గ్రామంలో మొత్తం 124 ఇళ్లు ఉన్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు నుంచి ఇద్దరు వరకు పైలట్లు ఉంటారు. అయితే, రకరకాల కారణాలతో ఇప్పుడు చాలా మంది ప్రజలు ఈ గ్రామాన్ని విడిచిపెట్టారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు పెద్ద నగరాల్లోకి వెళ్లిపోయారు. సెలవుల కోసం మాత్రమే వారి గ్రామాలకు తిరిగి వస్తారు. కానీ పర్యాటకుల కారణంగా ఈ గ్రామంలో ఎప్పుడూ రద్దీ ఉంటుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి