Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
దినఫలాలు (అక్టోబర్ 24, 2023): మేష రాశి వారికి మంగళవారంనాడు అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు జరిగిపోతాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పెండింగు పనుల్ని పూర్తి చేస్తారు. మిథున రాశి వారు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దినఫలాలు (అక్టోబర్ 24, 2023): మేష రాశి వారికి మంగళవారంనాడు అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు జరిగిపోతాయి. వృషభ రాశి వారికి ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పెండింగు పనుల్ని పూర్తి చేస్తారు. మిథున రాశి వారు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక, ఆర్థికంగా కూడా ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పెండింగు పనుల్ని పూర్తి చేస్తారు. బంధుమిత్రులలో కొందరికి అండగా నిలబడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల కాస్తంత విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాల్లో శ్రద్ధను పెంచాల్సి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగు పనులను సంతృప్తి కరంగా పూర్తి చేస్తారు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విజయవంతం అయ్యేలా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగపరంగా సతీమణి ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్ కు, షేర్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. అత్యాశకు పోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. లాభాల విషయంలో వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొందరు ఉద్యోగులు చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభిం చడం గానీ, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం గానీ చేసే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆదాయం లేదా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరం.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. కొత్త వ్యాపారాల మీద దృష్టి సారిస్తారు. ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. పిల్లల పురో గతికి సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. విదేశాల నుంచి మంచి ఆఫర్ అందు తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, ఇతర ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతా వరణం ఉంటుంది. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, ఆశ్లేష)
కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా కలిసి వస్తాయి. ఉద్యో గంలో బాధ్యతలు పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. కొందరు బంధువుల కారణంగా ఆర్థిక సమస్యలకు లోనవుతారు. ఓర్పుగా వ్యవహరిస్తే కుటుంబ వ్యవహారాలు సజావుగా పరిష్కారం అవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఏ రంగానికి చెందినవారికైనా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఉత్తమ ఫలితాలనిస్తాయి. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మాట చెల్లు బాటు అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలు పని చేస్తాయి. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. బాధ్యతల విషయంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండ డం మంచిది. వృథా ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలకు ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరు ద్యోగులు, అవివాహితుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోతారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.