Garba Dance: వెయ్యి మంది యువతీ యువకులు ఏకకాలంలో గర్భా.. తమ సంస్కృతి, సంప్రదాయం తరాలకు అందిస్తున్న అహిర్ కమ్యూనిటీ

అహిర్ సొసైటీకి చెందిన ఆడపిల్లలు సురక్షితమైన వాతావరణంలో గర్భా ఆడుకోవాలనే ఉద్దేశ్యంతో గత 30 సంవత్సరాలుగా అహిర్ సొసైటీ దీనిని నిర్వహిస్తోంది. నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారి పూజకు పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి ఇచ్చే హారతి వేరే వెరీ స్పెషల్. సుమారు రెండు లక్షలును థాలీ కి ఖర్చు చేస్తారు. 

Follow us
Surya Kala

|

Updated on: Oct 23, 2023 | 4:39 PM

శక్తిని ఆరాధించే పండగ దేవీ నవరాత్రి ఉత్సవాలు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించడమే కాదు.. దేశ వ్యాప్తంగా అమ్మవారిని తమ తమ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తూ పూజిస్తారు. ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా బతుకమ్మ, గర్భా, దాండియా వంటి వాటిని నిర్వహిస్తూ సందడి చేస్తారు. నవరాత్రి పండుగలో గుజరాతీ సంప్రదాయం, సంస్కృతిని గుర్తుచేస్తూ నిర్వహించే గర్భా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ఆడ మగ అందరూ కలిసి చేసే గర్భా డ్యాన్స్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అహిర్ కమ్యూనిటీ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. లస్కానాలో నవరాత్రుల సందర్భంగా.. అహిర్ కమ్యూనిటీకి చెందిన వెయ్యి మందికి పైగా సోదరసోదరీమణులు తమ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. దుస్తులను ధరించి నవరాత్రుల్లో తిరుగుతూ అందరినీ మంత్రముగ్ధులను చేశారు.

యావత్ దేశం నవరాత్రి పండగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక గార్భా అంటే వెంటనే గుర్తుకొచ్చేది సూరత్.. గుజరాత్ రాష్ట్రంతో సహా సూరత్ జిల్లాలో దేవీ నవరాత్రి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. నవరాత్రుల్లో ఏర్పాటు చేసే గర్భాలో పాల్గొనందానికి డబ్బులు చెల్లించి మరీ తమకున్న క్రేజ్ ను చెప్పకనే చెప్పేస్తుంటారు ఇక్కడ యువత. అయితే కామ్రాజ్‌లోని లస్కానా గ్రామంలోని అహిర్ సమాజ్ వాడీలో సాంప్రదాయ రాస్-గర్బా దర్శనం ఇచ్చింది. అహిర్ కమ్యూనిటీకి చెందిన కుమారులు, కుమార్తెలు బయట తిరగకుండా ఉండేందుకు నవరాత్రి ఉత్సవాలను వీరి సంఘం నిర్వహించింది. నోర్తనీ వేడుకలో సుమారు వెయ్యి మంది సోదర సోదరీమణులు ఆభరణాలతో పాటు వారి సాంప్రదాయ దుస్తులను ధరించి గర్బాను ప్రదర్శించారు.

అహిర్ సొసైటీకి చెందిన ఆడపిల్లలు సురక్షితమైన వాతావరణంలో గర్భా ఆడుకోవాలనే ఉద్దేశ్యంతో గత 30 సంవత్సరాలుగా అహిర్ సొసైటీ దీనిని నిర్వహిస్తోంది. నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారి పూజకు పెద్దపీట వేస్తారు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి ఇచ్చే హారతి వేరే వెరీ స్పెషల్. సుమారు రెండు లక్షలును థాలీ కి ఖర్చు చేస్తారు.  నవరాత్రు లో వసులు అయ్యే ప్రతి రూపాయి మళ్ళీ నవరాత్రుల ఖర్చుకు ఉపయోగించే విధంగా ప్రణాలికను సిద్ధం చేస్తుంది ఈ సొసైటీ..  నేటి ఆధునిక పోకడల మధ్య తమ ముందు తరాల పిల్లలకు తమ సంస్కృతి, సంప్రదాయం తెలియాలని.. అది వారు పాటించాలనే ఉద్దేశంలో అహిర్ సంఘం  ఈ రకమైన దేవీ నవరాత్రులను గత కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..