AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna River: యాత్రికులకు గుడ్ న్యూస్.. కృష్ణానదిలో 80 కిలోమీటర్ల బోట్ ప్రయాణం.. 3 ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనం..

ప్రయాణ సమయంలో పర్యాటకులకు బోటు లోనే ఆహారం అందుబాటులో ఉంచడంతో పాటు ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లోనూ అమృత్ కియోస్క్ లను ఏపీటీడీసీ ఏర్పాటు చేయనుంది. అధికారుల బృందం అమరావతి వరకు ట్రయల్ రన్ పూర్తి చేసింది. బోటు సిద్ధమైన తరువాత అధికారికంగా మరోసారి ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

Krishna River: యాత్రికులకు గుడ్ న్యూస్.. కృష్ణానదిలో 80 కిలోమీటర్ల బోట్ ప్రయాణం.. 3 ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనం..
Krishna River Boat Ride
M Sivakumar
| Edited By: Surya Kala|

Updated on: Oct 23, 2023 | 3:47 PM

Share

ఎకో- ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా కృష్ణానదిలో 80 కిలోమీటర్ల బోటు ప్రయాణాన్ని అందుబాటులోకి తేనుంది పర్యటన శాఖ.. విజయవాడలోని బెరంపార్కులో బయలుదేరే బోటు తొలుత కనకదుర్గమ్మ ఘాట్ కు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనం తరువాత అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం, అక్కడి నుంచి పంచారామాల్లో ఒకటైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనం చేయిస్తారు.

కృష్ణవేణి ప్రవాహ మార్గంలో ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఎన్నో.. అటువంటి కృష్ణమ్మ ఒడిలో పడవపై ఆధ్యాత్మిక యాత్రకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) శ్రీకారం చుడుతోంది. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక శోభ కలయికగా ప్రాజెక్టును రూపొందిస్తోంది. విజయవాడ నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై ప్రత్యేక బోటు తిప్పేందుకు చర్యలు చేపడుతోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని మూడు దేవాలయాలు, 2 పర్యాటక ప్రాంతాలను ఒక్క రోజులో చుట్టివచ్చేలా ప్రయాణ మార్గాన్ని రూపొందిస్తోంది..

ఎకో-ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా ఏపీటీడీసీ కృష్ణానదిలో రానుపోనూ సుమారు 80 కిలోమీటర్ల బోటు ప్రయాణాన్ని అందుబాటులోకి తేనుంది. విజయవాడలోని బెరంపార్కులో బయలుదేరే బోటు తొలుత కనకదుర్గమ్మ ఘాట్ కు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనం తరువాత అనంతవరంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం, అక్కడి నుంచి పంచారామాల్లో ఒకటైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనం చేయిస్తారు.

ఇవి కూడా చదవండి

మధ్యాహ్నం భోజనం తరువాత తిరుగు ప్రయాణంలో పవిత్ర సంగమం, భవానీ ద్వీపంలో ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. ఈ యాత్రలో ఆలయాల దర్శనంతో పాటు భోజన సదుపాయాలను ఏపీటీడీసీ ఏర్పా టు చేస్తుంది. బోటులో గైడ్ ను అందుబాటులో ఉంచనుంది. నాగార్జున సాగర్ నుంచి తీసుకొచ్చిన డబుల్ ఇంజిన్ బోటును ఏపీటీడీసీ ఈ ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తోంది. 40-45 మంది పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా ఈ బోటులో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రయాణ సమయంలో పర్యాటకులకు బోటు లోనే ఆహారం అందుబాటులో ఉంచడంతో పాటు ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లోనూ అమృత్ కియోస్క్ లను ఏపీటీడీసీ ఏర్పాటు చేయనుంది. అధికారుల బృందం అమరావతి వరకు ట్రయల్ రన్ పూర్తి చేసింది. బోటు సిద్ధమైన తరువాత అధికారికంగా మరోసారి ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. టికెట్ రేట్లు నిర్ణయించేందుకు ఏపీటీడీసీ ప్రత్యేక కమిటీని నియమించనుంది. తొలుత వారాంతాల్లో ఒకసారే ఈ యాత్రను చేపట్టాలని భావిస్తోంది. పర్యాటకుల ఆసక్తి మేరకు నెమ్మదిగా యాత్రల సంఖ్యను పెంచనుంది. 4 వారాల్లోగా బోటును సిద్ధం చేసి కార్తీకమాసంలో యాత్రకు పచ్చజెండా ఊపేలా కసరత్తు చేస్తోంది.

పర్యాటకులకు దైవదర్శనంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా కృష్ణానదిపై బోటు యాత్రను తీసుకొస్తున్నామని. పటిష్ట భద్రత మధ్య ప్రయాణం సంతోషంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వాటర్ సర్క్యూట్ టూరిజం కచ్చితంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బస్సులో వెళ్లి దైవ దర్శనం చేసుకోవడంతో పోల్చితే ఇది ఎంతో సులభంగా ఉంటుంది. ఈ ప్యాకేజీలో స్పెషల్ దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదం అందజేయనున్నారు. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి కన్నబాబు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…