AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తాగిన మైకంలో కొండచిలువను మెడలో వేసుకుని చక్కర్లు కొడుతూ.. ఫోటోలు తీయమని హల్ చల్

ఆ వ్యక్తి అలా కొండ చిలువను పట్టుకుని రావడంతో చూసిన వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. నిజానికి  కొండ చిలువలు విషపూరితం కానప్పటికీ.. ఖచ్చితంగా ప్రమాదకరమైనవి. అవి తమ శక్తిని అంతా ఉపయోగించి ఎటువంటి జీవికైనా హానిని కలిగిస్తాయి.  కొండచిలువలు భూమిపై కనిపించే అన్ని పాములలో అతిపెద్దవి. శక్తివంతమైనవి. మనిషిని సైతం కొండచిలువ చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసి తినేసే గుణం కలవి.

Viral Video: తాగిన మైకంలో కొండచిలువను మెడలో వేసుకుని చక్కర్లు కొడుతూ.. ఫోటోలు తీయమని హల్ చల్
Drunk Man
Surya Kala
|

Updated on: Oct 23, 2023 | 5:56 PM

Share

మద్యం తాగిన తర్వాత అతని ఆలోచనా శక్తిని, అర్థం చేసుకునే శక్తిని పూర్తిగా కోల్పోతాడు. అతనికి తాను ఏమి చేస్తున్నానో కూడా అర్ధం కాదు. మత్తు మనిషిని ఏ స్టేజ్ కు అయినా తీసుకుని వెళ్తుంది. చేసేది తప్పా.. ఒప్పా అనే విషయం కూడా మద్యం మత్తులో ఉన్నవారికి తెలియదని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇందుకు ఉదాహరణగా ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి మెడలో కొండ చిలువను పెట్టుకుని పెట్రోల్ పంపు వద్దకు చేరుకున్నాడు. ఇది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఆ వ్యక్తి అలా కొండ చిలువను పట్టుకుని రావడంతో చూసిన వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. నిజానికి  కొండ చిలువలు విషపూరితం కానప్పటికీ.. ఖచ్చితంగా ప్రమాదకరమైనవి. అవి తమ శక్తిని అంతా ఉపయోగించి ఎటువంటి జీవికైనా హానిని కలిగిస్తాయి.  కొండచిలువలు భూమిపై కనిపించే అన్ని పాములలో అతిపెద్దవి. శక్తివంతమైనవి. మనిషిని సైతం కొండచిలువ చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీసి తినేసే గుణం కలవి. అయితే కొండ చిలువను తీసుకుని వచ్చిన ఆ తాగుబోతు మనిషికి ఈ విషయాన్ని అర్థం కానట్లు ఉంది. అందుకనే ఆ కొండచిలువని వెంటబెట్టుకుని వచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందినది. తాగిన ఓ వ్యక్తి కొండ చిలువను తీసుకుని పెట్రోల్‌ పంప్‌ దగ్గరకు తీసుకుని రావడంతో అది చూసి అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మద్యం మత్తులో పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లే సమయంలో అతని మెడలో కొండచిలువ వేలాడుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాముతో ఉన్న తనను ఫోటో తీయమని అక్కడ ఉన్నవారిని కోరడం. అయితే అతను తాగి ఉన్నాడని అక్కడ ఉన్న వ్యక్తులకు అర్థమైంది.

అయితే కొంత సేపటికి అక్కడ పరిస్థితి భయం కోల్పోవిధంగా మారిపోయింది. ఎందుకంటే మనిషి చేతిలో ఉన్న కొండచిలువ కదలడం మొదలు పెట్టింది. అతని మెడ చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఇది చూసిన తర్వాత జనంలో ఆనందం మొదలైంది. అయితే అక్కడ ఉన్న వ్యక్తి ఎలాగో ధైర్యం చేసి కొండ చిలువను తాగుబోతు నుంచి వేరు చేసి.. దానిని పట్టుకుని గోనె సంచిలో వేసి బంధించాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..