Viral News: సముద్రపు ఒడ్డున కొట్టుకువచ్చిన వింత జీవి కళేబరం.. శాస్త్రవేత్తలు సైతం షాక్!

ఈ మర్మమైన జీవి మృతదేహం సెప్టెంబర్ 20న పాపువా న్యూ గినియాలోని సింబ్రి ద్వీపం తీరంలో కనిపించింది. ఇది ఒక చిన్న అగ్నిపర్వత ద్వీపం. ఇక్కడ సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు. ఈ వింత జీవి స్థానికంగా కలకలం రేపింది. ఈ వింతజీవిని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు బీచ్ వైపు పరుగులు తీశారు.

Viral News: సముద్రపు ఒడ్డున కొట్టుకువచ్చిన వింత జీవి కళేబరం.. శాస్త్రవేత్తలు సైతం షాక్!
Rare Sea Creatures
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2023 | 1:27 PM

మత్స్యకన్యల గురించి సినిమాల్లో చూసి ఉండవచ్చు. రకరకాల కథలను విని ఉండవచ్చు.  అయితే అలాంటి జీవి నిజంగా ఈ ప్రపంచంలో ఉందా..? అంటే ఇది నిజం అంటూ ధృవీకరించడానికి ఇంకా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే తాజాగా పాపువా న్యూ గినియా లో వింత జీవి అంటూ వైరల్ అయిన చిత్రాన్ని చూసిన ప్రజలు షాక్ అయ్యారు. ఇక్కడ సముద్రం నుంచి ఓ మర్మమైన జీవి తీరానికి   కొట్టుకువచ్చింది. ఈ వింత జీవిని ప్రజలు ‘మెర్మైడ్ గ్లోబ్మాస్టర్’ అని పిలుస్తున్నారు.

ఈ మర్మమైన జీవి మృతదేహం సెప్టెంబర్ 20న పాపువా న్యూ గినియాలోని సింబ్రి ద్వీపం తీరంలో కనిపించింది. ఇది ఒక చిన్న అగ్నిపర్వత ద్వీపం. ఇక్కడ సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు. ఈ వింత జీవి స్థానికంగా కలకలం రేపింది. ఈ వింతజీవిని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు బీచ్ వైపు పరుగులు తీశారు.

లైవ్ సైన్స్ ప్రకారం శాస్త్రవేత్తలు కూడా ఈ జీవిని చూసి ఆశ్చర్యపోతున్నారు.  ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా ఈ జీవి ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. సముద్ర జంతువు కావచ్చునని భావిస్తున్నారు. అదే సమయంలో, ఈ రహస్య జీవి గురించి ఇంటర్నెట్‌లో రకరకాల ఊహాగానాలు చేస్తూ కామెంట్ చేస్తున్నారు. దీనిని సముద్రపు ఆవుగా అభివర్ణించగా, మరికొందరు దీనిని డాల్ఫిన్, షార్క్ అని అభివర్ణించారు. అదే సమయంలో మత్స్యకన్యలా భావించే అలాంటి వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది గ్లోబస్టర్ అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సముద్ర జీవుల అవశేషాలను గుర్తించడం కష్టంగా ఉందని అంటున్నారు. సింబ్రి ద్వీపం ఒడ్డున కొట్టు కొచ్చిన సముద్ర జీవి శరీరం చాలా భాగం కుళ్లిపోయి గుర్తుపట్టలేనంతగా ఉంది. నివేదికల ప్రకారం స్థానికులు ఈ వింత జీవి మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టారు.

ఫేస్‌బుక్‌లో న్యూ ఐర్లాండ్స్ ఓన్లీ అనే పేజీ ఈ జీవి సంబంధించిన కొన్ని చిత్రాలను షేర్ చేసింది.  స్థానికులు దీనిని పాతిపెట్టినందున పరిమాణం, బరువు తెలియదని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..