Viral Video: వీళ్లు మహా ముదుర్లు.. క్షణాల్లో BMW కారు నుంచి రూ.14 లక్షల క్యాష్ అపహరణ
బెంగళూరులో షాకింగ్ చోరీ ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ చేసిన బీఎండబ్ల్యూ కారులో నుంచి రూ. 13.75 లక్షల నగదును ఇద్దరు దుండగులు చాకచక్యంగా అపహరించారు. బీఎండబ్ల్యూ ఎక్స్5 కారును సోంపురలోని సబ్ రిజిస్ట్రార్ దగ్గర పార్కింగ్‌లో నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీకి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Bengaluru Theft Case: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో షాకింగ్ చోరీ జరిగింది. పార్కింగ్ చేసిన బీఎండబ్ల్యూ కారులో నుంచి రూ. 13.75 లక్షల నగదును ఇద్దరు దుండగులు చాకచక్యంగా అపహరించారు. బీఎండబ్ల్యూ ఎక్స్5 కారును సోంపురలోని సబ్ రిజిస్ట్రార్ దగ్గర పార్కింగ్‌లో నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీకి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మాస్క్ ధరించిన ఇద్దరు దుండులు బైక్‌పై వచ్చారు. ఓ దుండగుడు డ్రైవర్ వైపున కారు అద్దాలను పగులగొట్టి కారులోని నగదును అతికష్టం మీద అపరించాడు. అనంతరం దుండగులు ఇద్దరూ ఆ బైక్‌పై అక్కడి నుంచి జారుకున్నారు. బైక్‌పై ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. అంతా కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది.
కారు ఆపి ఉంచిన ప్రాంతానికి వెనుక వైపే కొన్ని మీటర్ల దూరంలోనే కొందరు ప్రయాణీకులు బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డు అయ్యింది. అయినా అక్కడున్న ఎవరూ దొంగతనం జరుగుతున్నట్లు గుర్తించలేకపోయారు.
ఈ ఘటనపై సదరు కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. కారులో ఓ కవర్‌లో ఉంచిన రూ. 13.75 లక్షల నగదును దుండుగులు ఎత్తుకెళ్లారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ చోరీ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగుళూరు పోలీసులు తెలిపినట్లు టీవీ9 కన్నడ ఓ కథనంలో తెలిపింది. అటు ఈ చోరీ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.
బెంగళూరులో జరిగిన షాకింగ్ చోరీ ఘటన.. సీసీటీవీ దృశ్యాలు..
Bengaluru: 13 lakh cash stolen from parked BMW car near Sarjapur.
BREAKING NEWS#ViratKohli𓃵 #heartattack #WhatsApp #GarbaWithElvish pic.twitter.com/c8s57iL5sN
— Saffronic Vibes (@saffronic_vibes) October 23, 2023
డబ్బులు బైకులు, కార్లలో ఉంచి వెళ్లొద్దరి పోలీసులు పదేపదే సూచిస్తున్నాయి. అయినా కొందరు ఈ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తూ అనవసర ఇక్కట్లు కొని తెచ్చుకుంటున్నారు. గతంలోనూ ఇదే తరహా చోరీ ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇలాంటి చోరీ ఘటనల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, నగదును వాహనాల్లో ఉంచి వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ దొంగతనం కేసు బెంగుళూరు నగరవాసులను షాక్‌కు గురిచేస్తోంది. వాట్సప్‌లోనూ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.