ఓరి దేవుడా.. కుక్కపిల్లను చూసి లేగదూడగా కన్ఫ్యూజ్ అయిన ఆవులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ప్రపంచంలో రెండు వేర్వేరు జంతువుల మధ్య  స్నేహం, ప్రేమ వంటివి సాధ్యంకాదు. అవి ఒకరికొకరు బద్ధ శత్రువులుగా ఉంటాయి.. లేదా వాటి మధ్య ఎలాంటి సంబంధానికి అవకాశం ఉండదు. నీ దారి నీది.. నా దారి నాది అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాయి.  అయితే అలాంటి రెండు భిన్నమైన జంతువుల మధ్య బంధానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓరి దేవుడా.. కుక్కపిల్లను చూసి లేగదూడగా కన్ఫ్యూజ్ అయిన ఆవులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Animal Love Viral Video
Follow us

|

Updated on: Oct 23, 2023 | 6:41 PM

ప్రపంచంలో రెండు వేర్వేరు జంతువుల మధ్య  స్నేహం, ప్రేమ వంటివి దాదాపుగా సాధ్యంకాదు. అవి ఒకరికొకరు బద్ధ శత్రువులుగా ఉంటాయి.. లేదా వాటి మధ్య ఎలాంటి సంబంధానికి అవకాశం ఉండదు. నీ దారి నీది.. నా దారి నాది అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని వైరీ జంతువుల మధ్య స్నేహం అరుదుగా మాత్రమే కనిపిస్తుంటుంది. నేరుగా విషయంలోకి వస్తే.. రెండు భిన్నమైన జంతువుల మధ్య బంధానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో 3 ఆవులు, ఒక కుక్కపిల్లని చూడవచ్చు. మూడు ఆవులూ కుక్కను దూడలా భావించి లాలిస్తున్నాయి. ఆ కుక్కపిల్ల కూడా వాటిని చూసి భయపడి.. వాటిపై మొరగడం వంటి సహజ లక్షణాలను ప్రదర్శించకపోవడం విశేషం. జంతువుల మధ్య అసాధారణ ప్రేమను చాటుతున్న ఈ వీడియో జంతు ప్రియులతో పాటు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

X లో (@AMAZlNGNATURE) పేరుతో ఈ వైరల్ వీడియోను పోస్ట్ చేశారు. అవి దీన్ని లేగ దూడగా భావించాయి అంటూ క్యాప్షన్ పెట్టారు. కేవలం 6 సెకన్ల ఈ క్లిప్‌లో, మూడు నలుపు-తెలుపు రంగు ఆవులు నలుపు-తెలుపు రంగులోని కుక్కపిల్లని దూడను లాలించినట్లే లాలిస్తుండటం చూడవచ్చు. ఈ సమయంలో కుక్కపిల్ల ప్రవర్తన చూపరులకు నవ్వు తెప్పించేలా ఉంది. అయితే ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారు.. తదితర సమాచారం లేదు.

కుక్కపిల్లను లేగదూడగా భావించి లాలిస్తున్న ఆవులు..వీడియో

అక్టోబరు 22న పోస్ట్ చేసిన ఈ క్లిప్.. కొన్ని గంటల వ్యవధిలోనే 11 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. నలుపు, తెలుపు రంగులోని కుక్క పిల్లను చూసి దూడగా భావించి ఆవులు కన్ఫ్యూజ్ అయినందునే ఇదంతా జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమతో ఆవులు ఆ కుక్కపిల్లను చంపేస్తున్నాయంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కుక్క పిల్ల చూపులు చాలా విచిత్రంగా ఉందని, నవ్వు తెప్పిస్తోందని మరో నెటిజన్ పేర్కొన్నాడు. అయితే కన్ఫ్యూజన్‌లోనే ఆవులు కుక్కపిల్లను లాలిస్తున్నాయని.. నిజం ఏంటో తెలిస్తే దాన్ని తమ దగ్గరకు కూడా రానించేవి కావని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

ఇటీవల కుక్కతో కోతి స్నేహం, ఆవుతో పాము చెలిమి వంటి జంతువుల మధ్య అరుదైన బంధానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇప్పుడు కుక్కపిల్ల, ఆవుల మధ్య బంధం కూడా నెటిజన్లను అలరిస్తోంది.