Bhagavanth Kesari: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భగవంత్‌ కేసరిలో మరోపాట.. ఆ క్లాసికల్‌ సాంగ్‌ రీమిక్సేనా?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్‌ కేసరి సినిమా వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అక్టోబర్‌ 19న దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా సమాజంలోని సున్నితమైన కొన్ని సమస్యలను స్పృశిస్తూ సందేశాత్మకంగా సినిమాను తెరకెక్కించడం, అందులో స్టార్‌ హీరో బాలయ్య నటించడం భగవంత్ కేసరి విజయంలో కీ రోల్ పోషించాయి

Bhagavanth Kesari: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భగవంత్‌ కేసరిలో మరోపాట.. ఆ క్లాసికల్‌ సాంగ్‌ రీమిక్సేనా?
Bhagavanth Kesari Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2023 | 12:46 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్‌ కేసరి సినిమా వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అక్టోబర్‌ 19న దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా సమాజంలోని సున్నితమైన కొన్ని సమస్యలను స్పృశిస్తూ సందేశాత్మకంగా సినిమాను తెరకెక్కించడం, అందులో స్టార్‌ హీరో బాలయ్య నటించడం భగవంత్ కేసరి విజయంలో కీ రోల్ పోషించాయి. అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల బాలయ్య కూతురు విజ్జీపాపగా నటించి మెప్పించింది. అలాగే సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. కాగా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోన్న భగవంత్‌ కేసరి గురించి బాలయ్య మరో గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. ఈ సినిమాలో మరో పాటను జత చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన భగవంత్‌ కేసరి బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ విషయంపై మాట్లాడారు. సుమారు నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న సాంగ్‌ను 50-60 మంది డ్యాన్సర్లతో తీశామని, ఇప్పుడా పాటను యాడ్ చేయబోతున్నట్టు చెప్పారు. అయితే ఎప్పటి నుంచి జత చేస్తున్నట్లు మాత్రం తెలపలేదు.

కాగా భగవంత్‌ కేసరి సినిమాలో దంచవే మేనత్త కూతురా బిట్‌ సాంగ్‌ కూడా ఉంది. అయితే సందేశాత్మకంగా సాగే సినిమాలో రెగ్యులర్‌ మాస్‌ సాంగ్స్‌ ఉంటే మూవీ ఫ్లో దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో దానిని పక్కన పెట్టేశారు. సినిమా రిలీజైన కొన్ని రోజుల తర్వాత అభిమానుల కోసం మళ్లీ కలుపుతామని చెప్పుకొచ్చారు డైరెక్టర్‌. ఇప్పుడు బాలకృష్ణ కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో భగవంత్‌ కేసరిలో మంచి మాస్‌ బీట్‌ సాంగ్‌ను చూడొచ్చన్నమాట. కాగా భగవంత్‌ కేసరి సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ స్టైలిష్‌ విలన్‌గా నటించాడు. అలాగే శరత్‌ కుమార్‌, రవి శంకర్‌, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌, జాన్‌ విజయ్‌, రాహుల్‌ రవి తదితరులు కీలక పాత్రల ఓనటించారు. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఎస్‌. థమన్‌ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలయ్య స్పీచ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?