AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

God OTT: అప్పుడే ఓటీటీలోకి నయనతార సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌.. ‘గాడ్‌’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇరైవన్‌. తెలుగులో గాడ్‌గా రిలీజైంది. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ సెప్టెంబర్‌ 28 తమిళంలో విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో రెండు వారాల తర్వాత తెలుగులోనూ గాడ్ పేరుతో థియేటర్లలో రిలీజ్‌ చేశారు.

God OTT: అప్పుడే ఓటీటీలోకి నయనతార సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌.. 'గాడ్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
God Movie
Basha Shek
|

Updated on: Oct 24, 2023 | 10:58 AM

Share

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇరైవన్‌. తెలుగులో గాడ్‌గా రిలీజైంది. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ సెప్టెంబర్‌ 28 తమిళంలో విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో రెండు వారాల తర్వాత తెలుగులోనూ గాడ్ పేరుతో థియేటర్లలో రిలీజ్‌ చేశారు. అక్టోబర్‌ 13న విడుదలైన ఈ మూవీ ఇక్కడ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. అయితే అప్పుడే ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ గాడ్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 26 నుంచి ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి తీసుకురానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ గాడ్‌ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

అమ్మాయిలను క్రూరంగా చంపిందెవరు?

గాడ్‌ సినిమాలో నయనతార, జయం రవితో పాటు వినోద్ కిష‌న్‌, రాహుల్ బోస్‌, విజ‌య‌ల‌క్ష్మి, న‌రైన్‌, ఆశిష్ విద్యార్థి , చార్లీ, అశ్విన్‌ కుమార్‌, భగవత్ పెరుమాల్‌ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు నటించారు. ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సిటీలో సైకో కిల్లర్ (రాహుల్ బోస్) అమ్మాయిలను అపహరించి అతి కిరాతకంగా చంపేస్తుంటాడు. అతనిని ఐపీఎస్‌ ఆఫీసర్‌ అర్జున్‌ (నయనతార) పట్టుకుంటారు. అయితే ఆ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. మరి అసలు వాళ్లని చంపేది ఎవరు? ఎందుకు అలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? అర్జున్‌ ఆ సైకో కిల్లర్‌ను పట్టుకున్నాడా? ఇందులో ప్రియ (నయనతార) పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే గాడ్‌ సినిమా చూడాల్సిందే. థియేటర్లలో ఈ సైకో థ్రిల్లర్‌ మూవీని మిస్‌ అయి ఉంటే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరో రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్..

గాడ్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
వేప మ్యాజిక్.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మటుమాయం..
వేప మ్యాజిక్.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మటుమాయం..
పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి..
బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి..
కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్..
కాలర్ పట్టుకున్న యువతి! గన్ తీసిన పోలీస్..
జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా?
జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా?