AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: యావర్‏ను పిచ్చోడు అనేసిన శోభా.. ప్రిన్స్ ఉగ్రరూపం.. బిగ్‏బాస్ ప్రోమో చూశారా ?..

ఈ టాస్కులో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఎవరు కెప్టెన్ అవుతారనేది మిగతా ఇంటి సభ్యుల నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అన్నారు బిగ్‏బాస్. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉండకూడుదని భావిస్తారో ఆ హౌస్మేట్ మెడలో మిర్చి దండను వేయాల్సి ఉంటుందని ఆదేశించాడు బిగ్‏బాస్. ఇక ముందుగా వచ్చిన అమర్ దీప్.. ప్రశాంత్ ను ఉద్దేశిస్తూ.. నీ పక్కన ఉన్న వారంతా నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లకు వాళ్లు కాపాడుకోవాలి. మళ్లీ తిరిగి ఆడాలని వాళ్లకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో నాకు దండ వేస్తే వాళ్లు సేవ్ అవుతారు

Bigg Boss 7 Telugu: యావర్‏ను పిచ్చోడు అనేసిన శోభా.. ప్రిన్స్ ఉగ్రరూపం.. బిగ్‏బాస్ ప్రోమో చూశారా ?..
Bigg Boss 7 Telugu
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2023 | 11:21 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం కెప్టెన్సీ కోసం రసవత్తరంగా పోటీ జరుగుతుంది. వారం రోజులుగా జరిగిన టాస్కులలో చివరకు ఐదుగురు హౌస్మేట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ నిలిచారు. ఇక వీరిలో ఇప్పుడు కెప్టెన్ అయ్యేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఈ వారం బిగ్‏బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు ఇస్తున్న టాస్క్.. ‘ఈ మిర్చి చాలా హాట్ గురు’. ఈ టాస్కులో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఎవరు కెప్టెన్ అవుతారనేది మిగతా ఇంటి సభ్యుల నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అన్నారు బిగ్‏బాస్. ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉండకూడుదని భావిస్తారో ఆ హౌస్మేట్ మెడలో మిర్చి దండను వేయాల్సి ఉంటుందని ఆదేశించాడు బిగ్‏బాస్. ఇక ముందుగా వచ్చిన అమర్ దీప్.. ప్రశాంత్ ను ఉద్దేశిస్తూ.. నీ పక్కన ఉన్న వారంతా నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లకు వాళ్లు కాపాడుకోవాలి. మళ్లీ తిరిగి ఆడాలని వాళ్లకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో నాకు దండ వేస్తే వాళ్లు సేవ్ అవుతారు అనుకుంటే తప్పకుండా వేయు.. కానీ దీనికి నామినేషన్స్ కు ఏమైనా సంబంధం ఉందా అసలు అంటూ పాయింట్స్ మాట్లాడాడు ప్రశాంత్. ఇక్కడ నచ్చాల్సింది ఒకరిద్దరికి కాదు.. హౌస్ అందరికీ నచ్చాలి అంటూ మిర్చి దండను ప్రశాంత్ మెడలో వేశాడు అమర్.

ఇక భోలే మాట్లాడుతూ.. నాకు కనపడ్డ ఐదుగురిలో ప్రస్తుతం ఇప్పుడు నువ్వు అంటూ చెప్పగా.. ఇప్పుడు నేను ప్రశాంత్ లాగా మాట్లాడలా.. అమ్మా పక్కకు వెళ్లి ఆడుకోమ్మా అన్నట్లుగా ఉందంటూ సీరియస్ అయ్యింది ప్రియాంక. మధ్యలో ప్రశాంత్ గురించి ఎందుకు తీస్తున్నావ్ అని భోలే అడగడంతో నేను తీసుకుంటున్నా అంటూ రివర్స్ అయ్యింది ప్రియాంక. ఇక ఆ తర్వాత శోభా మెడలో మిర్చి దండ వేసింది రతిక. ఆ సమయంలో వీరిద్దరు మధ్య గొడవ జరిగింది. కెప్టెన్ అయ్యాక ఇదే బ్యాలెన్సింగ్ నీలో ఉండదని రతిక చెప్పగా.. వాళ్లు చెప్తారు నీకేంటీ ప్రాబ్లమ్ అంటూ గొడవ స్టార్ట్ చేసింది శోభా. రతిక మిర్చి దండ వేయడానికి ప్రయత్నిస్తుండగా.. వద్దంటూ పక్కకు వెళ్లిపోయింది.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇక ఆ తర్వాత నీలాగ చెత్త రీజన్ ఇవ్వను.. కానీ ఇస్తాను. ఇదే పరిస్థితి నాకు కూడా వస్తుంది.. నువ్వు ఇక్కడ నిలబడతావు. అప్పుడు నేను మాట్లాడుతా అంటూ సీరియస్ అయ్యింది. సరే అంటూ యావర్ ఆన్సర్ ఇవ్వగా.. పిచ్చొడు.. పిచ్చోడు అంటా అంటూ యావర్ మీద మీదకెళ్లి అరిచేసింది. దీంతో సహనం కోల్పోయిన యావర్.. నన్ను పిచ్చోడివి అంటావా అంటూ మిర్చి దండను నెలకేసి కొట్టాడు. వీరిద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. మిర్చి దండను తనకు తానుగా మెడలో వేసుకుని పిచ్చిగా బిహేవ్ చేసింది శోభా. ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ కెప్టెన్ అయినట్లుగా సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్-టు-హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్-టు-హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
అలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఇల్లే స్వర్గమవుతుంది..
అలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఇల్లే స్వర్గమవుతుంది..
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింతకు లైన్ క్లియర్!
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింతకు లైన్ క్లియర్!
విద్యార్ధులకు పోలీస్‌ హెచ్చరిక.. ఆ కాలేజీల్లో చేరి మోసపోవద్దు!
విద్యార్ధులకు పోలీస్‌ హెచ్చరిక.. ఆ కాలేజీల్లో చేరి మోసపోవద్దు!
ఒక్కసారిగా మారిన వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఒక్కసారిగా మారిన వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
శరీరంపై ఈ చోట్ల పుట్టుమచ్చ ఉందా? అయితే అదృష్టం, డబ్బు, విజయం..
శరీరంపై ఈ చోట్ల పుట్టుమచ్చ ఉందా? అయితే అదృష్టం, డబ్బు, విజయం..
దూసుకొస్తున్న వాయుగుండం! తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
దూసుకొస్తున్న వాయుగుండం! తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
బడి పిల్లలకు తప్పిన భారీ ప్రమాదం తప్పింది..!
బడి పిల్లలకు తప్పిన భారీ ప్రమాదం తప్పింది..!
ఐకానిక్ సెలబ్రేషన్ రీక్రియేట్.. ఆ దిగ్గజం గుర్తున్నాడా?
ఐకానిక్ సెలబ్రేషన్ రీక్రియేట్.. ఆ దిగ్గజం గుర్తున్నాడా?
హోంశాఖలో ఉద్యోగాల జాతర.. 7,437 పోలీస్ కొలువుల భర్తీ కసరత్తు ఆరంభం
హోంశాఖలో ఉద్యోగాల జాతర.. 7,437 పోలీస్ కొలువుల భర్తీ కసరత్తు ఆరంభం