AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డిగ్రీ కూడా పూర్తి చేయలేదు.. పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

డిగ్రీ కూడా పూర్తి చేయని ఈ అందాల తార పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. నిజం చెప్పాలంటే ఈ హీరోయిన్ లక్కీ ఛార్మ్ అని చెప్పవచ్చు.

Tollywood: డిగ్రీ కూడా పూర్తి చేయలేదు.. పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 16, 2026 | 4:32 PM

Share

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ఎంతలా అంటే ఇప్పుడీ హీరోయిన్ సినిమా చేస్తే సూపర్ హిట్ అన్న విధంగా మారిపోయింది. ఆ హిట్ అవుతోన్న సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే ది మోస్ట్ లక్కీ ఛార్మ్ గా మారిపోయిందీ క్రేజీ హీరోయిన్. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్‌ అని గ్రామానికి చెందిన ఈ చిన్నది ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే డిగ్రీ పూర్తి చేయకుండానే హీరోయిన్ గా మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టింది. 2017 నుంచే సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ రెండేళ్ల క్రితమే తెలుగుతెరకు పరిచయమైంది. కేవలం డబ్బింగ్ చిత్రాలు మాత్రమే చేస్తున్నా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోందీ అందాల తార. అలాగే తన అభినయంతో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడీ హీరోయిన్ పేరు మళ్లీ మార్మోగుతోంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఆమె మరెవరో కాదు ప్రేమలు సినిమతో పలకరించి ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో తన అల్లరితో ఆకట్టుకున్న మమితా బైజు.

ఇవి కూడా చదవండి

ప్రేమలు తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ తో రెబెల్ సినిమాలో చేసింది మమితా బైజు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా మమితా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. దీని తర్వాత ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్, ధనుష్ తో కలిసి కర అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఇక తాజాగా సూర్యతో కలిసి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చేసింది మమితా బైజు. ఇందులో మ్యాడీగా ఆమె చేసిన అల్లరి సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఎమోషనల్ సీన్లలోనూ ఈ క్యూటీ బాగా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే హీరో సూర్యనే డామినేట్ చేసిందని మమితకు ప్రశంసలు వచ్చాయి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరింది. మొత్తానికి వరుస విజయాలతో ఇప్పుడు దక్షిణాదిలో ది మోస్ట్ క్రేజీ యెస్ట్ హీరోయిన్ గా మారిపోయిందీ అందాల తార.

సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో మమితా బైజు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడీ హీరోయిన్ పేరు తెగ మార్మోగుతోంది
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడీ హీరోయిన్ పేరు తెగ మార్మోగుతోంది
పోలీసుల తనిఖీలు సరే.. మరి వీటికి అనుమతులెక్కడవి?
పోలీసుల తనిఖీలు సరే.. మరి వీటికి అనుమతులెక్కడవి?
నాగ పంచమి నాడు పెనం, కడాయి ఎందుకు ఉపయోగించరు? ఈ పనులు చేస్తే..
నాగ పంచమి నాడు పెనం, కడాయి ఎందుకు ఉపయోగించరు? ఈ పనులు చేస్తే..
మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..?వీడియో చూశాక
మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..?వీడియో చూశాక
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
ఏటీఎమ్‌లో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం..
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
లాఫింగ్ బుద్ధ ఎవరు? ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? ఫెంగ్ షుయ్, వాస్తు ఏం
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
ఆసీస్ గడ్డపై గత్తరలేపిన బంగ్లా.. భారత్, పాక్‌లకే సాధ్యంకాలే..
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా?
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి.. హఠాత్తుగా దాడి చేసిన ఆక్టోపస్‌..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..
సంఖ్యాశాస్త్రం.. ఈ 3 సంఖ్యలకు విజయం ఆలస్యంగా.. కానీ వచ్చిందంటే..