దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే గంటల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.