DCతో బ్లాక్ బస్టర్ హిట్టు.. ఆ స్టార్ హీరో సరసన హీరోయిన్ ఛాన్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

05 September 2026

దక్షిణాది సినీ పరిశ్రమతో పాటు ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక వామిగా గబ్బికి భారీ ఆఫర్ వరించినట్లుగా తెలుస్తోంది.

వామికా గబ్బి

ఇటీవల విడుదలైన 'డిసి' (DC) చిత్రం సూపర్ హిట్ కావడం, అందులో ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో ఈ భామకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.

వామికా గబ్బి

తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య సరసన కథానాయికగా నటించే గోల్డెన్ ఛాన్స్ ఈ బ్యూటీకి లభించినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

మరో ఛాన్స్

సూర్య ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

సూర్య జోడిగా

ఈ క్రమంలోనే సూర్యా నటించబోయే 49వ చిత్రం (#Suriya49) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

సూర్య జోడిగా

ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న యాక్షన్ అండ్ ఎంటర్టైనింగ్ డ్రామాలో సూర్యాకు జోడీగా వామిగా గబ్బిని ఎంపిక చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

సౌత్ లో మరోసారి

ప్రస్తుతం వరుస హిట్లు అందుకుంటున్న వామిగా, స్టార్ హీరో సూర్యా కాంబినేషన్ తెరకు సరికొత్త గ్లామర్ , ఎనర్జీని ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గ్లామర్ బ్యూటీ..

ఈ సినిమాను 'జన నాయగన్' వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అంచనాలు పీక్స్