AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Nirvana: అప్పుడు నడుము గిల్లె సీన్ చేయనంది.. తర్వాత బేబీ చూసి షాకయ్యా.. వైష్ణవి గురించి ఇరుముడి డైరెక్టర్ కామెంట్స్..

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ లాంచ్‌లో దర్శకుడు శివ నిర్వాణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీ ట్రైలర్ అభినందనలు తెలిపారు. దర్శకుడు ఆదిత్య, నటీనటులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, సంగీత దర్శకుడు హిషామ్‌ల పనితీరును ప్రత్యేకంగా కొనియాడారు. సినిమా అద్భుతమైన విజువల్స్, సంగీతంతో ప్రేక్షకులని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Shiva Nirvana: అప్పుడు నడుము గిల్లె సీన్ చేయనంది.. తర్వాత బేబీ చూసి షాకయ్యా.. వైష్ణవి గురించి ఇరుముడి డైరెక్టర్ కామెంట్స్..
Vaishnavi Chaitanya, Shiva
Rajitha Chanti
|

Updated on: Sep 05, 2026 | 12:01 PM

Share

బేబీ కాంబో మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. ఈమూవీపై మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ తమ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. తొలుత ఆయన ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. వేదికపై ఉన్న యువ దర్శకుల శక్తివంతమైన ఉత్సాహాన్ని, సానుకూల వాతావరణాన్ని ఆయన ప్రశంసించారు. కొత్త చిత్రాలతో వస్తున్న ప్రతిభావంతులైన దర్శకులలో ఆదిత్య ఒకరని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాగే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ, “బేబీ” చిత్రం తర్వాత ఇంత త్వరగా ఈ జంట మళ్లీ తెరపైకి రావడం ఊహించలేదని తెలిపారు. “బేబీ” తనను ఎంతగానో ప్రభావితం చేసిన చిత్రమని, ప్రేమకథల్లో అది తనను కదిలించిందని అన్నారు. “బేబీ” తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్‌లో కొత్త చిత్రం ప్రకటన, టీజర్ విడుదలైనప్పుడు, “బేబీ”ని మించి ఏం చేస్తారు, ఏం చెబుతారు అని ఆలోచించానని, అయితే టీజర్ చూసిన తర్వాత దర్శకుడు ఆదిత్యను అభినందించకుండా ఉండలేకపోయానని శివ నిర్వాణ తెలిపారు.

ఆదిత్య “బేబీ”తో ఏమాత్రం సంబంధం లేని ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని, ఇది ఆయనకు దక్కిన మొదటి పెద్ద విజయమని నిర్వాణ అన్నారు. చిత్రంలోని పాత్రలు, నేపథ్యం, వాతావరణం, సంగీతం, విజువల్స్ అన్నీ విభిన్నంగా ఉన్నాయని ప్రశంసించారు. ఆదిత్యను దర్శకులు నాగేష్ కుకునూర్, ఇంతియాజ్ అలీ వంటి విద్యావంతులు, సున్నితమైన, ఆధునికమైన దర్శకులతో పోల్చారు. ఈ జోనర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. కొత్త చిత్ర విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, ఆధునిక స్పర్శతో కూడిన రూటెడ్ కథాంశం జెన్-జీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని శివ నిర్వాణ అభిప్రాయపడ్డారు. రిలీజ్ రోజు నుంచి థియేటర్లలో సందడి ఖాయమన్నారు. సంగీత దర్శకుడు హిషామ్ గురించి మాట్లాడుతూ, “సంచారమే” పాట విడుదలైన వెంటనే తాను అతనికి కాల్ చేసి అభినందించానని చెప్పారు. మలయాళం నుంచి వచ్చి గోరటి వెంకన్న వంటి వారి చేత పాడించడం గొప్ప విషయమన్నారు. హిషామ్‌ను “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నారని, తెలుగు సినిమాకు అతని సంగీత సహకారం అద్భుతమని కొనియాడారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

ఆనంద్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో పాటు దేవరకొండ కుటుంబం అంటే తనకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుందని తెలిపారు. ఆనంద్ “పక్కింటి అబ్బాయి” ఇమేజ్‌ను కలిగి ఉన్నారని, ఈ ఇమేజ్ పొందడం చాలా కష్టమని అన్నారు. పవన్ కళ్యాణ్ “తొలిప్రేమ”లో, ప్రభాస్ “వర్షం”లో, మహేష్ బాబు “పోకిరి”లో, సిద్ధార్థ్ “బొమ్మరిల్లు”లో చేసిన పాత్రల మాదిరిగానే, ఆనంద్ “మిడిల్ క్లాస్ మెలోడీస్”, “బేబీ” చిత్రాలలో చేసిన పాత్రలు కాలాతీతమైనవని, అవి కుటుంబాలలో ఒక బలమైన ముద్రను వేస్తాయని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

వైష్ణవి చైతన్య నటిగా ఎంతో ఎదిగారని శివ నిర్వాణ ప్రశంసించారు. “టక్ జగదీష్” చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటనను గుర్తుచేసుకుంటూ, అప్పుడు ఓ సీన్‌లో రౌడీ వచ్చి వైషు నడుము గిల్లాలి. కానీ తను వద్దని చెప్పింది. ఆ సన్నివేశంలో వైష్ణవి ఇబ్బంది పడిందని, అయితే “బేబీ”లో ఆమె కన్విక్షన్ చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. “టక్ జగదీష్”లోని చిన్న పాత్ర నుంచి “బేబీ” వరకు, ఇప్పుడు రష్మిక మందన్న వంటి పవర్‌హౌస్ పర్ఫార్మర్‌తో కలిసి తెరను పంచుకునే స్థాయికి వైష్ణవి ఎదిగారని అభినందించారు. దర్శకుడు శివాజీ, “90స్” వంటి వెబ్ సిరీస్‌లను, “లిటిల్ హార్ట్స్” వంటి చిత్రాలను ప్రస్తావిస్తూ, చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చివరగా, చిత్ర సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, ముఖ్యంగా నాగవంశీ గారికి ఈ చిత్రం ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Follow Us
వైష్ణవి చైతన్య గురించి ఇరుముడి డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..
వైష్ణవి చైతన్య గురించి ఇరుముడి డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..
వల వేసిన జాలరికి ఏం చిక్కిందంటే..?
వల వేసిన జాలరికి ఏం చిక్కిందంటే..?
వైభవ్ కోసమే నా భార్య క్రికెట్ చూస్తోంది..: శ్రీకాంత్
వైభవ్ కోసమే నా భార్య క్రికెట్ చూస్తోంది..: శ్రీకాంత్
ముళ్ల పొదల్లోంచి వింత శబ్దాలు.. దగ్గరకెళ్లి చూడగా గుండె పగిలే..
ముళ్ల పొదల్లోంచి వింత శబ్దాలు.. దగ్గరకెళ్లి చూడగా గుండె పగిలే..
టీచర్స్ డే.. చదువు చెప్పిన గురువుకు ఓ చిన్న థ్యాంక్స్..
టీచర్స్ డే.. చదువు చెప్పిన గురువుకు ఓ చిన్న థ్యాంక్స్..
టాలీవుడ్‌లో ఉపాధ్యాయ పాత్రలతో మెప్పించిన గుర్తుండిపోయే సినిమాలు
టాలీవుడ్‌లో ఉపాధ్యాయ పాత్రలతో మెప్పించిన గుర్తుండిపోయే సినిమాలు
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు