తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బ్రిటన్ పర్యటన చుట్టూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. సీఎం అయిన తర్వాత ఆయనకు ఇదే తొలి విదేశీ పర్యటన. లండన్లో విజయ్ తన భార్య సంగీతను కలుస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో సంగీత తమ విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో, విజయ్-సంగీత మళ్లీ కలుస్తారనే వార్తలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది.