AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో గోడల బూజు, తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు!

వర్షాకాలంలో చాలా ఇళ్లలో ఎదురయ్యే ప్రధాన సమస్య గోడలు తేమ పట్టడం, ప్లాస్టరింగ్ ఊడిపోవడం. గోడలలో తేమ చేరడం వల్ల ఇంటి అందం పాడవడమే కాకుండా, పెయింట్ పగుళ్లు బారినపడి పాచి, సిలిండ్రాలు చేరతాయి. ఇది ఇంటి నిర్మాణాత్మక బలానికి భంగం కలిగిస్తుంది. అలాగే ఇంట్లో దుర్వాసన, శ్వాసకోశ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, గోడల సీపేజ్‌ను నివారించడానికి ప్రభావవంతమైన పరిష్కారాలను అనుసరించడం చాలా అవసరం. వర్షాకాలంలో గోడల బూజు, తేమ పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

వర్షాకాలంలో గోడల బూజు, తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు!
Monsoon Wall Seepage
Jyothi Gadda
|

Updated on: Sep 05, 2026 | 11:05 AM

Share

వర్షాకాలం రాగానే ఇళ్లలో తీవ్రంగా వేధించే సమస్యల్లో గోడల సీపేజ్, తేమ ప్రధానమైనవి. వర్షపు నీరు గోడల ద్వారా ఇంట్లోకి ఇంకిపోవడం వల్ల పెయింట్ ఊడిపోవడం, నల్లటి బూజు పడటం, దుర్వాసన రావడం జరుగుతుంది. ఇది ఇంటి లుక్‌ను పాడుచేయడమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా హానికరం. వర్షాకాలంలో మీ ఇంటి గోడలను తేమ నుండి కాపాడుకోవడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన పరిష్కారాలు ఇవే:

గోడల పగుళ్లను పూడ్చడం:

వర్షాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటి బయటి, లోపలి గోడలను నిశితంగా పరిశీలించాలి. ఎక్కడైనా చిన్న పగుళ్లు ఉంటే వాటిని వెంటనే వాటర్‌ప్రూఫ్ పుట్టీ లేదా సిలికాన్ సీలెంట్‌తో పూర్తిగా పూడ్చివేయాలి. దీనివల్ల వర్షపు నీరు గోడల లోపలికి ఇంకకుండా నిరోధించవచ్చు.

వాటర్‌ప్రూఫింగ్ పెయింట్స్, కోటింగ్స్:

ఇంటి వెలుపలి గోడలకు నాణ్యత కలిగిన ఎక్స్‌టీరియర్ వాటర్‌ప్రూఫ్ పెయింట్ వేయడం చాలా ముఖ్యం. ఇవి గోడలపై ఒక రక్షణ కవచంలా పనిచేసి నీటిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అలాగే, లోపలి గోడలకు డ్యాంప్ ప్రూఫ్ కోటింగ్ వాడటం వల్ల గోడలు తేమ పట్టకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

డ్రైనేజీ, కవర్ల నిర్వహణ:

ఇంటి పైకప్పు మీద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పైకప్పు డ్రైనేజీ పైపులు అడ్డంకులు లేకుండా ఉంటే వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్ళిపోతుంది. నీరు ఎక్కువ సేపు డాబాపై నిలిచిపోతే అది మెల్లగా సీలింగ్ ద్వారా కింది గోడల్లోకి ప్రవేశిస్తుంది.

సరైన గాలి వెలుతురు:

వర్షం లేని సమయంలో కిటికీలు తెరిచి ఉంచి ఇంట్లోకి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. గదిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేదా డీహుమిడిఫైయర్ వాడటం వల్ల గాలిలోని తేమ తగ్గి బూజు పట్టకుండా ఉంటుంది.

పైపుల లీకేజీలను సరిచేయడం:

ఇంటి లోపలి ప్లంబింగ్ పైపులు, బాత్‌రూమ్ లీకేజీలు ఉంటే వెంటనే వాటర్‌ప్రూఫింగ్ నిపుణులతో సరిచేయించాలి. లోపలి పైపుల లీకేజీలు కూడా గోడలపై తేమ రూపంలో ప్రత్యక్షమవుతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ ఇంటిని సీపేజ్ సమస్య నుండి కాపాడుకోవడమే కాకుండా, గోడల ఆయుష్షును పెంచుకోవచ్చు!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం