కరివేపాకు తీసి వేస్తున్నారా? దీని ఉపయోగాలు తెలిస్తే నోరళ్లబెడతారు!

Samatha

31   August 2026

ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే దానిలో కరివేపాకు ముందుంటుంది. కరివేపాకు లేని వంటిల్లు ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా కరివేపాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కానీ కొంత మంది కూరలు, పప్పు చారుల్లో కరివేపాకు వస్తే తీసి పక్కన వేస్తారు. కానీ  దీనిని తింటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట.

కాగా, ఇప్పుడు మనం ప్రతి రోజూ కరివేపాకు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

కరివేపాకులో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉండటుంది. అందువలన ఇది జుట్టు రాలడాన్ని ఆపి, తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది

కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, డయాబెటిస్ ఉన్నవారికి ఇది వరం అంటారు.

కరివేపాకులో విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువలన ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి ఆరోగ్యానికి మంచిది.

అలాగే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం  వలన దీనిని తినడం వలన మొటిమలు, నల్ల మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.