చాణక్య నీతి : వీరి చేతిలో డబ్బు నిలవడం కష్టం

Samatha

29 August 2026

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప తత్వ వేత్త, అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.

అయితే చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకం రచించిన విషయం తెలిసిందే. దానిలో అనేక అంశాలను పొందుపరిచారు. డబ్బు, బంధాలు బంధుత్వాలు ఇలా చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

అదే విధంగా చాణక్యుడు కొంత మంది చేతిలో అస్సలే డబ్బు నిలవదు అని తెలియజేశాడు. కాగా, ఇప్పుడు మనం ఎవరి చేతిలో డబ్బు నిలవదో చూద్దాం.

ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎవరు అయితే విరివిగా , డబ్బు గురించి ఆలోచించకుండా ఖర్చు చేస్తుంటారో, వారి చేతిలో డబ్బు అస్సలే నిలవదంట.

కొంత మంది అస్సలే పొదుపుల గురించి ఆలోచించరు. అయితే ఎవరు అయితే పొదుపుల గురించి ఆలోచించరో వారి వద్ద ధనం నిలవదు.

అలాగే కొంత మంది ఇతరుల లగ్జరీ లైఫ్ చూసి దానికి ఆకర్షితులు అవుతారు. అలాంటి జీవితం కోసం డబ్బు ఖర్చు పెడతారు, వారి వద్ద సంపద ఉండదు.

అంతే కాకుండా కొందరు సంపాదిస్తున్నాం కదా, అని వారికి వస్తున్న దాని కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు. అలాంటి వారి వద్ద కూడా డబ్బు మిగలదు