AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా ఇలా కాదు.. బరువు తగ్గడానికి గుడ్లను ఎలా తినాలో తెలుసా..?

బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ మొదలుపెట్టగానే గుర్తొచ్చే మొదటి ఆహారం గుడ్డు. తక్కువ క్యాలరీలు, పుష్కలమైన ప్రోటీన్‌తో నిండిన గుడ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బరువు తగ్గాలనుకునే వారు పచ్చసొనతో సహా తినాలా? లేక కేవలం తెల్లసొన మాత్రమే తీసుకోవాలా? రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిది? వంటి డౌట్లు చాలామందిలో ఉంటాయి. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Sep 05, 2026 | 8:00 AM

Share
గుడ్డు పచ్చసొన, తెల్లసొన రెండూ శరీరానికి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చసొనలో విటమిన్ డి, బి కాంప్లెక్స్ విటమిన్లు, నాడీ వ్యవస్థకు మేలు చేసే కోలిన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. మరోవైపు తెల్లసొనలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉండి, దాదాపు పూర్తిగా స్వచ్ఛమైన ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల లక్ష్యాన్ని బట్టి వీటి ఎంపిక ఆధారపడి ఉంటుంది.

1 / 5
పోషకాల గణాంకాలను పరిశీలిస్తే.. రెండు పూర్తి గుడ్లు సుమారు 140 కేలరీలు, 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్, మంచి కొవ్వులను అందిస్తాయి. అదే సమయంలో ఐదు గుడ్డు తెల్లసొనలు దాదాపు 85 కేలరీలతో పాటు ఏకంగా 18 గ్రాముల ప్రోటీన్‌ను సమకూరుస్తాయి. బరువు నియంత్రణలో ఉంటూనే శరీరానికి అవసరమైన క్యాలరీ లోటును కొనసాగించాలనుకునే వారికి తెల్లసొన బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.

2 / 5
కండరాల పెరుగుదల, దృఢత్వం, బరువు తగ్గడానికి నిపుణులు రోజుకు రెండు లేదా మూడు గుడ్డు తెల్లసొనలను సిఫార్సు చేస్తున్నారు. మరింత తీవ్రమైన ఫిట్‌నెస్ లక్ష్యాలు లేదా బరువు తగ్గించే ప్రణాళిక ఉన్నవారు రోజుకు ఐదు తెల్లసొనల వరకు తీసుకోవడం ఆరోగ్యకరం. ఇది శరీరంలోని కండర ద్రవ్యరాశి తగ్గకుండా కాపాడుతూ, ఆకలిని నియంత్రించి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

3 / 5
ఉదయం అల్పాహారంలో ఓట్‌మీల్‌తో కలిపి గుడ్లను తీసుకోవడం బరువు తగ్గడానికి అద్భుతమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఓట్‌మీల్‌లోని సంక్లిష్ట పిండిపదార్థాలు నెమ్మదిగా జీర్ణమై ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీనికి గుడ్లలోని ప్రోటీన్ తోడైతే జీవక్రియ వేగవంతమై, శరీరంలోని అదనపు కేలరీలు సులభంగా కరుగుతాయి.

4 / 5
గుడ్లను ఎలా తయారు చేసుకుంటున్నామనేది అత్యంత కీలకం. నూనె లేదా వెన్న ఎక్కువగా వాడకుం, నీటిలో ఉడకబెట్టి లేదా ఆవిరిపై ఉడికించి తినడం ఉత్తమమైన పద్ధతి. సాధారణ ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ఎవరైనా రోజుకు 1 నుండి 3 గుడ్లను తమ రోజువారీ సమతుల్య ఆహారంలో నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చు.

5 / 5
Follow Us