AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ చేయూత పెన్షన్లకు బిగ్ అప్‌డేట్.. సర్టిఫికెట్లు లేకపోయినా దరఖాస్తు చేయవచ్చు!

తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జులై 31తోనే గడువు ముగిసింది.. కానీ, సెప్టెంబర్‌ 15 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే చేయూత పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియను సైతం మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇకపై అవసరమైన కొన్ని ముఖ్యమైన సర్టిఫికెట్లు వెంటనే అందుబాటులో లేకపోయినా ఆన్‌లైన్ ద్వారా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ చేయూత పెన్షన్లకు బిగ్ అప్‌డేట్.. సర్టిఫికెట్లు లేకపోయినా దరఖాస్తు చేయవచ్చు!
Telangana Cheyutha Pension
Jyothi Gadda
|

Updated on: Sep 04, 2026 | 9:51 AM

Share

తెలంగాణలోని అర్హులైన పేద ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇతరుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలామందికి వివిధ రకాల అధికారిక పత్రాలు లేకపోవడం లేదా ఆ సర్టిఫికెట్లు రావడం ఆలస్యం కావడం వల్ల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం చేయూత దరఖాస్తుదారులకు భారీ ఊరట నిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇంతకుముందు చేయూత పెన్షన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయాలంటే సంబంధిత రాబడి ధ్రువీకరణ పత్రం, వయోపరిమితి పత్రం లేదా వికలాంగుల సదరం సర్టిఫికెట్ వంటివి వెంటనే అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ కొత్త సడలింపుల ప్రకారం, ప్రస్తుతం దరఖాస్తు సమయంలో ఇవి అందుబాటులో లేకున్నా సరే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును సబ్మిట్ చేసిన తర్వాత, ప్రభుత్వం నియమించిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఇంటికి వస్తారు. ఆ ప్రత్యక్ష తనిఖీ సమయంలో లేదా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేలోగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు నేరుగా సమర్పిస్తే సరిపోతుంది.

అయితే, దరఖాస్తుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఫారమ్‌లో మీ వివరాలు, ఆధార్ కార్డ్ సంఖ్య, బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్‌ను సరిగ్గా నమోదు చేయాలి. అధికారులు వెరిఫికేషన్‌కు వచ్చే సమయానికి కావాల్సిన కుల, ఆదాయ, వైకల్య లేదా ఇతర ఆధారిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు మీసేవ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ ఆలస్యం వల్ల ప్రభుత్వ పథకానికి అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు సమయం ముగిసిపోతోందనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం దరఖాస్తుదారులకు వేగంగా సేవలందించేందుకు ఈ సులభతర విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం కల్పించిన ఈ సులభమైన దరఖాస్తు వెసులుబాటు వల్ల వేలాది మంది అర్హులకు పెన్షన్ పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి, సర్టిఫికెట్లు రావడం లేదని ఆందోళన చెందకుండా అర్హులందరూ వెంటనే చేయూత పథకానికి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us