AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. 500లకు పైగా సినిమాలు.. రెండు పెళ్లిళ్లు.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..

దక్షిణాది సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి జయంతి. సహజమైన నటన, ధైర్యమైన నిర్ణయాలతో వెండితెరపై ఓ సంచలనం సృష్టించారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి, మూడు దశాబ్దాల పాటు నాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరించిన జయంతి సుదీర్ఘ సినీ ప్రస్థానం ఇది.

Tollywood : 14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. 500లకు పైగా సినిమాలు.. రెండు పెళ్లిళ్లు.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
Jayanthi
Rajitha Chanti
|

Updated on: Sep 05, 2026 | 10:22 AM

Share

సహజమైన నటనకు పెట్టింది పేరు, దక్షిణాది సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న అగ్ర నటి జయంతి. ఆవిడ నటనలో కృత్రిమత్వం కనిపించదు. నృత్యం ఆవిడకున్న బలం. 1945 జనవరి 6న సంయుక్త మద్రాస్ రాష్ట్రంలోని బళ్ళారిలో కమలకుమారిగా జన్మించారు. ఆమె తండ్రి సుబ్రమణ్యం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో లెక్చరర్. తల్లి సంతానలక్ష్మి. కమలకుమారి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో, సంతానలక్ష్మి పిల్లలను తీసుకొని మద్రాస్ చేరుకున్నారు. అప్పటికి కమలకుమారికి 12 ఏళ్లు. డ్యాన్స్ పట్ల ఆమెకు ఉన్న అమితమైన ఇష్టాన్ని గుర్తించిన తల్లి, చంద్రకళ అనే డాన్సర్ దగ్గర చేర్పించారు. బళ్ళారిలో ఉన్నప్పుడే ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి చిత్రం చూసి కమలకుమారి ఆయనకు అభిమాని అయ్యారు. మద్రాస్ చేరిన తర్వాత మనోరమతో కలిసి స్టూడియోలకు వెళ్లి ఎన్టీఆర్ ను చూడాలని ప్రయత్నించేవారు. చిరంజీవులు చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ను అంధుడిగా చూసి కమలకుమారి కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడు ఎన్టీఆర్ ఆమెను ఓదార్చి, నటన పట్ల ప్రోత్సహించారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

14 ఏళ్ల వయసులో కన్నడ దర్శకుడు వై.ఆర్.స్వామి జనుగూడు చిత్రంలో అవకాశం కల్పించారు. మొదట తల్లి సంతానలక్ష్మి భయపడి నిరాకరించినా, స్వామి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారు. 1963లో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. కమలకుమారి నటించిన రెండవ సినిమా తెలుగులో జగదేకవీరుని కథ. ఇందులో వరుణ దేవుని కుమార్తె వారుణిగా నటించారు. మొదట్లో వయ్యారంగా నడవలేదని దర్శకుడు కేవీ రెడ్డి కోప్పడి, ఆయనే నడిచి చూపించారు. తెలుగులో మొదటి చిత్రం భార్యాభర్తలు (అక్కినేని సరసన చిన్న వేషం) విడుదలైంది. కన్నడంలో రాజ్ కుమార్ సరసన సోలో హీరోయిన్‌గా నటించిన చెందవళ్ళియ తోట సూపర్ హిట్ కావడంతో, అక్కడ ఆయనతో దాదాపు 30 సినిమాల్లో నటించారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

కమలకుమారి పేరుతో కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత, స్వర్ణమంజరి సినిమాతో తన పేరును జయంతిగా మార్చుకున్నారు. ఈ చిత్రంలో ఆమె మత్స్యకన్యగా కనిపించారు. 1965లో వచ్చిన సతీ లీలావతి జయంతి కెరీర్‌లో ఒక మైలురాయి. ఈ చిత్రంలో స్విమ్ సూట్‌లో కనిపించి, దక్షిణాదిలో బోల్డ్ హీరోయిన్‌గా సంచలనం సృష్టించారు. ఇది ఒక దక్షిణాది నటి అలాంటి కాస్ట్యూమ్స్‌లో కనిపించడం అదే ప్రథమం. ఈ ధైర్యానికి ఆమెకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. మిస్ లీలావతి చిత్రంతో రాష్ట్రపతి అవార్డును అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి ఇందిరా గాంధీ చేతుల మీదుగా అందుకున్నారు. జయంతి కేవలం కన్నడ, తెలుగుకే పరిమితం కాలేదు. తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో కూడా నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. తమిళం రాని సమయంలో మహానటి సావిత్రి మందలించడంతో పట్టుదలతో తమిళం నేర్చుకొని తమిళ చిత్రాల్లోనూ రాణించారు. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, రాజ్ కుమార్, ఎంజీఆర్, జెమినీ గణేషన్, ప్రేమ్ నజీర్, దారా సింగ్ వంటి అగ్ర తారల సరసన నటించి అలరించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

వ్యక్తిగత జీవితంలో జయంతి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. పేకేటి శివరామ్, బండారు గిరిబాబులతో జరిగిన వివాహాలు ఎక్కువకాలం నిలవలేదు. యువ నటుడు రాజశేఖర్‌ను మూడవ వివాహం చేసుకొని సంచలనం సృష్టించారు. 1982లో జరిగిన ఈ వివాహం నాటికి జయంతి వయసు 34 కాగా, రాజశేఖర్ వయసు 22. రాజశేఖర్ తల్లిదండ్రులు ఒప్పుకోవడం విశేషం. ఈ వివాహం కూడా చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. తన కొడుకు కృష్ణకుమార్ తో పాటు, కోడలు అను కూడా నటి. రాజకీయాల్లోకి ప్రవేశించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఆహ్వానం మేరకు ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దక్షిణాది సినిమా స్వర్ణయుగంలో తనదైన ముద్ర వేసి, 2021 జూలై 26న కన్నుమూశారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!
ఈశ్వర్ సాయి వివాదంలో కొత్త ట్విస్ట్..
ఈశ్వర్ సాయి వివాదంలో కొత్త ట్విస్ట్..
పొయ్యి ముట్టించకుండా చేసే పచ్చి కొబ్బరి పాయసం
పొయ్యి ముట్టించకుండా చేసే పచ్చి కొబ్బరి పాయసం
నవ్వుతూనే నరకం అనుభవించా.. అది జీవితంలో కోలుకోలేని దెబ్బ..
నవ్వుతూనే నరకం అనుభవించా.. అది జీవితంలో కోలుకోలేని దెబ్బ..
కాకి చేసిన పనికి కాలి బూడిదైన 18 లక్షలు.. ఏం జరిగిందో తెలిస్తే..
కాకి చేసిన పనికి కాలి బూడిదైన 18 లక్షలు.. ఏం జరిగిందో తెలిస్తే..