AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌!

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌!

Phani CH
|

Updated on: Sep 04, 2026 | 8:31 PM

Share

రోజంతా పని చేసి ఇంటికి వచ్చిన నలుగురు యువకులు రాత్రి నిద్రకు సిద్ధమయ్యారు. ఓ యువకుడు దోమల బెడదతో దోమతెర ఏర్పాటు చేసుకున్నాడు. లోపలికి వెళ్లే సమయంలో కాలు ఏదో మెత్తగా తగలడంతో పరిశీలించగా, ఏకంగా ఆరడుగుల నాగుపాము కనిపించింది. భయంతో బయటకు పరుగులు తీసిన యువకులు స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన అర్ధరాత్రి పామును సురక్షితంగా పట్టుకుని తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి తిరిగివచ్చిన నలుగురు బ్యాచిలర్స్, రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. అందులో ఒక యువకుడు దోమల బెడదను తట్టుకోలేక తన మంచంపై దోమతెరను సిద్ధం చేసుకున్నాడు. పడుకోవడానికి వెళ్లిన అతను, దోమతెరను చేతితో పైకి లేపి లోపలికి కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో తెర కింద ఉన్న భాగాన్ని కాలుతో తాకగా.. ఏదో మెత్తగా ప్రాణం ఉన్నట్లు తగిలింది. అనుమానం వచ్చి కదిలించి చూడగా, ఆ యువకుడి గుండె ఆగిపోయినంత పనైంది. దోమతెర లోపల ఏకంగా ఆరడుగుల నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. ఒక్క క్షణం తేడా వచ్చినా ఆ యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న ఆ యువకులు ప్రాణభయంతో వెంటనే బయటకు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అక్కడకు చేరుకున్న కిరణ్ కుమార్, ఎంతో జాగ్రత్తగా నాగుపామును బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు దోమతెరపై కాలు వేసినప్పటికీ ఆ యువకుడికి పాము కాటు వేయలేదని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని కిరణ్ కుమార్ తెలిపారు. నిద్రలోకి జారుకునే ముందు ఒకటికి రెండుసార్లు పరిసరాలను పరిశీలించుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mirzapur: డిజిటల్లో బిగ్ హిట్ అయిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు

OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..!

Follow Us