Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్నాయి. సెప్టెంబర్ 4న పగటి వేళల్లో ఎండ, ఉక్కపోత కొనసాగినా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాల్లో సాయంత్రం జల్లులు పడొచ్చు. ఏపీలో బలమైన గాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. ఇదే సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, తుంగభద్ర జలాశయాల్లో నీటి పరిస్థితులు, రైతుల సాగునీటి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా వేగంగా మారిపోతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రాంతాల్లో గాలి దిశ మారడంతో రెండు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా, సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉండబోతోందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలలో పగలు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నా.. సడెన్‌గా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ పై భాగంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం క్రమంగా పశ్చిమ వైపునకు పయనిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై దీని ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండనుంది. బలమైన మేఘాలు వస్తూ పోతున్నప్పటికీ, పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయితే నైరుతీ రుతుపవనాల్లో కొంత తేమ ఉండటంతో అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. పలు జిల్లాల్లో గాలిలో తేమ పెరగడం వల్ల అక్కడక్కడ సాయంత్రం వేళల్లో చినుకులు పడవచ్చు. అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మధ్యాహ్నానికి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రానికి వర్షాలు కురుస్తాయి. రాజధాని హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. తెలంగాణలో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. శుక్రవారం నుంచి సెప్పెంబరు 12 వరకు పగటి వేళల్లో ఎండ, తీవ్రమైన ఉక్కపోత ఉంటాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల మధ్య అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రాజధాని హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు పడొచ్చని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయి. గత 20 రోజులుగా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీరు పూర్తిగా నిలిచిపోవడం, ఏపీ, తెలంగాణ సాగునీటి కాలువలకు, జల విద్యుత్ ఉత్పత్తికి భారీగా నీటిని వదలడంతో జలాశయంలో నీటి పరిమాణం వేగంగా తగ్గుతోంది. ప్రస్తుతం 144 టీఎంసీలకు పడిపోవడం నీటిపారుదల శాఖ అధికారులను కలవరపెడుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా 15,723 క్యూసెక్కులుగా నమోదు కాగా, కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 535.60 అడుగుల వద్ద ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 179.28 టీఎంసీల నీరు నిల్వ ఉందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,900 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, దిగువకు 9,878 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.36 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అలాగే 9.657 టీఎంసీల గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 9.336 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని రెండు యూనిట్లలో నిరంతరాయంగా 78 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్ఐ) డి-17 కాలువ నుంచి సాగునీరు అందడంలేదని పెద్దాపూర్, లక్ష్మాపూర్, మామిళ్లపల్లి గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. కేఎల్ఐ కాలువ ద్వారా నీళ్లు విడుదల చేసి నెల రోజులవుతున్నా తమ పొలాలకు ప్రయోజనం కలగలేదని వాపోయారు. కాలువలోని మట్టిని, అడ్డంగా పడిన బండరాళ్లను తొలగించి సాగునీరు సమృద్ధిగా వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ముందు వంటావార్పు చేపట్టడమే కాకుండా కేఎల్ఐ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. వనపర్తి జిల్లా రూరల్ మండలం రాజనగరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యాలయం ముందు ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు ఖాళీ యూరియా బస్తాలతో ధర్నా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 30 వేల మందికి యూరియా అవసరముంటే, యాప్‌లో కేవలం 300 బస్తాలు మాత్రమే చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా బుక్ చేసుకుంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర మండలాల్లో రీడింగ్ చూపిస్తోందని, చదువు రాని రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. యాప్ విధానాన్ని స్వస్తి పలికి, పాత పద్ధతిలోనే పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలని ఫోన్లు చేతబూని నిరసన తెరిపారు. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో శుక్ర, శని వారాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తూ అక్కడక్కడ తేలికపాటి వానలు పడే వీలుంది.బంగాళాఖాతంలో 40 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీ తీరంలో గంటకు 35 కి.మీ, తెలంగాణలో 30 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఏపీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, తెలంగాణలో 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో తేమ 60%, కోస్తా, రాయలసీమల్లో 42%, తెలంగాణలో 55% వరకు ఉండనుంది. తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గింది. ప్రస్తుతం డ్యామ్‌లోకి 5,092 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో 9,894 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1,630.21 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 94.857 టీఎంసీల నీటి నిల్వ ఉన్న్టట్లు అధికారులు వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒడిసి మండలంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాల్లేక వేరుశనగ పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ధోన్నికోట వారిపల్లి, నారప్ప గారి పల్లి గ్రామాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసం చేసిన అప్పులు తీరే మార్గం లేకపోవడంతో, కనీసం పశువుల మేతకైనా పనికొస్తుందనే ఆశతో రైతులు ఎండిపోయిన పంటను కూలీలతో పీకించేస్తున్నారు. ఎకరాలకు లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు హనుమంతరెడ్డి, గోవిందరెడ్డి వేడుకుంటున్నారు. మంచి వర్షాలను ఆకాంక్షిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య అనుగ్రహంతో టీటీడీ నిర్వహించిన ఐదు రోజుల ధార్మిక యాగ మహోత్సవాలు గురువారం మహాపూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. వరుణ జపం, పర్జన్యశాంతి హోమాలను 32 మంది వేదరుత్వికుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురిసి, అతివృష్టి మరియు అనావృష్టి బాధలు లేకుండా ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు వైదిక పండితులు తెలిపారు. గ్లోబల్ స్థాయిలో తీవ్రమవుతున్న ‘ఎల్ నినో’ ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. సముద్ర ఉపరితలం వేడెక్కడంతో అక్కడ ఒకేసారి నాలుగు భయంకరమైన తుపాన్లు, మూడు అల్పపీడనాలు అత్యంత క్రియాశీలంగా మారినట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. వీటిలో ‘లోవెల్’ తుపాను అత్యంత భీకరంగా తయారై గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న సుడిగాలులతో విరుచుకుపడుతోంది. మరోవైపు ‘మారీ’ తుపాను గంటకు 155 కిలోమీటర్లు, ‘కరీనా’ తుపాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో మహాసముద్రాన్ని వణికిస్తున్నాయి. వీటితో పాటు చైనా తీర సమీపంలో ‘క్రోవాన్హ్’ తుపాను గంటకు 75 కిలోమీటర్ల వేగంతో కొనసాగుతోంది. రోజురోజుకు ఎల్ నినో తీవ్రత పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో పసిఫిక్ సముద్రంలో మరిన్ని తీవ్ర తుపాన్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

